Advertisement

  • గుజరాత్ గోదాం ఫైర్ యాక్సిడెంట్ పై స్పందించిన ప్రధాని మోడీ

గుజరాత్ గోదాం ఫైర్ యాక్సిడెంట్ పై స్పందించిన ప్రధాని మోడీ

By: Sankar Wed, 04 Nov 2020 8:26 PM

గుజరాత్ గోదాం ఫైర్ యాక్సిడెంట్ పై స్పందించిన ప్రధాని మోడీ


అహ్మదాబాద్‌లో గోదాం అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ‘గోదాం అగ్ని ప్రమాదంలో కార్మికులు మరణించడం చాలా బాధాకరమైన విషయం. ప్రభుత్వం, అధికారులు తక్షణం స్పందించి గాయాలపాలైన వారికి సహాయం అందించాలి.

వారు తొందరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్‌ వేదికగా స్పందించారు.కాగా బుధవారం వస్త్ర గోదాంలో మంటలు వ్యాపించడంతో తొమ్మిది మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన అహ్మదాబాద్‌ పిప్లాజ్ రోడ్‌లోని టెక్స్‌టైల్ గోడౌన్ చోటు చేసుకుంది.

గోదాం దగ్గర్లోని ఓ రసాయన పరిశ్రమలో పేలుడు సంభవించడంతో మంటలు ఏర్పడ్డాయి. అనంతరం అవి గోదాంకి వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు ఎగసిపడటంతో గోదాంలోని కార్మికులు తప్పించుకోవడం కష్టంగా మారింది. బయటకి పరిగెత్తె క్రమంలో చాలామంది గాయాల పాలయ్యారు. మంటలు, పేలుడు కారణంగానే భవనం కూలిపోయిందని అగ్నిమాపక అధికారిజయేష్ ఖాడియా తెలిపారు.ఈ ఘటనలో తొమ్మిదిమంది ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారన్నారు. గాయపడిన వారిని శిథిలాల నుండి బయటకు తీసి ఎల్జీ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు.


Tags :

Advertisement