Advertisement

  • కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప్రధాని నరేంద్ర మోడీ

By: chandrasekar Thu, 10 Dec 2020 7:19 PM

కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి శంకుస్థాప‌న చేసిన ప్రధాని నరేంద్ర మోడీ


దేశంలో మార్పులు అవసరమని ఇందుకోసం కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్‌కు సాక్షిగా నిలుస్తుంద‌ని తెలిపారు. కొత్త భ‌వ‌న నిర్మాణం దేశ చ‌రిత్ర‌లో మైలురాయి అని అయన చెప్పారు. కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌న నిర్మాణానికి ఇవాళ‌ శంకుస్థాప‌న జ‌రిగింద‌ని, ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన రోజు అని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. ఢిల్లీలో సెంట్ర‌ల్ విస్టాకు భూమిపూజ నిర్వ‌హించిన త‌ర్వాత ఆయ‌న సమావేశం ఏర్పాటుచేసి అందులో మాట్లాడారు. ఇందుకోసం దేశ ప్ర‌జ‌లంతా క‌లిసి ఈ కొత్త బిల్డింగ్‌ను నిర్మిస్తార‌ని చెప్పారు. 130 కోట్ల మంది భార‌తీయుల‌కు ఇది చ‌రిత్రాత్మ‌క‌మైన సంద‌ర్భం అని, ఈ కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం దేశంలో పాత‌, కొత్త స‌హ‌జీవ‌నానికి ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంద‌న్నారు. 2014లో తొలిసారి ఓ ఎంపీగా పార్ల‌మెంట్ భవన్ లో ప్ర‌వేశించిన రోజు త‌న జీవితంలో ఎన్న‌డూ మ‌రిచిపోన‌న్నారు. తను ప్ర‌జాస్వామ్య ఆల‌యంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత‌ తానెప్పుడూ త‌న శిర‌స్సును వంచి ప్ర‌జాస్వామ్య ఆల‌యానికి సెల్యూట్ చేసిన‌ట్లు ప్ర‌ధాని మోదీ చెప్పారు. పాత పార్ల‌మెంట్ భ‌వ‌నం స్వాతంత్య్ర ఉద్య‌మానికి పూర్వం మార్గ‌ద‌ర్శ‌కం చేసింద‌ని, అయితే కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్‌కు సాక్షిగా నిలుస్తుంద‌ని ప్రధాని తెలిపారు.

మన పాత పార్ల‌మెంట్ భ‌వ‌నంలో గ‌త వందేండ్ల‌లో ఎన్నో పున‌ర్ నిర్మాణాలు జ‌రిగాయ‌ని, ఇప్పుడు ఆ బిల్డింగ్‌ రెస్ట్ కోరుకుంటోంద‌ని, 21వ శ‌తాబ్ధానికి కొత్త బిల్డింగ్‌ను ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త అని ఆయ‌న చేప్పారు. భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం ఓ సంస్కృతిగా మారింద‌ని మరియు ఇక్క‌డ ప్ర‌జాస్వామ్యం ఓ జీవ‌న శైలి అని అదే ఈ దేశ ప్రాణ‌మ‌ని శ‌తాబ్ధాల అనుభ‌వం నుంచి భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డింద‌ని ప్ర‌ధాని మోదీ తెలిపారు. దేశంలో ఎన్నో మార్పులు జ‌రిగాయ‌ని, కానీ ప్ర‌జాస్వామ్య‌మే మ‌న ఆత్మ‌గా కొన‌సాగుతోంద‌న్నారు. ప్ర‌పంచ‌దేశాలు భార‌త్‌ను ప్ర‌జాస్వామ్యానికి త‌ల్లిగా గుర్తిస్తార‌ని ప్ర‌ధాని తెలిపారు. ప్రస్తుతం వివిధ రాజకీయ పార్టీల మ‌ధ్య భిన్న‌మైన అభిప్రాయాలు ఉన్నా ప్ర‌జాసేవే ప్ర‌జాప్ర‌తినిధుల ముఖ్య ల‌క్ష్యం కావాల‌న్నారు. ఇండియా ఫ‌స్ట్ అన్న సంక‌ల్ప‌న తీసుకోవాల‌న్నారు. భార‌తదేశ వికాస‌మే ఆరాధ‌న కావాల‌న్నారు. 2047లో భార‌త స్వాతంత్య్రానికి వందేళ్లు నిండుతాయ‌ని, అప్పుడు దేశం ఎలా ఉండాల‌న్న సంక‌ల్పంతో ప‌నిచేయాల‌న్నారు. ఆత్మ‌నిర్బ‌ర్ భార‌త్ నిర్మాణాన్ని ఎవ‌రూ ఆప‌లేర‌న్నారు. దేశ హిత‌మే ముఖ్య‌మైంద‌న్నారు.

Tags :

Advertisement