Advertisement

  • భారత భూభాగంపై కన్నేస్తే దీటైన సమాధానమిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ

భారత భూభాగంపై కన్నేస్తే దీటైన సమాధానమిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ

By: chandrasekar Mon, 29 June 2020 2:26 PM

భారత భూభాగంపై కన్నేస్తే దీటైన సమాధానమిస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ


పొరుగు దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భారత్ మీద కన్నెస్తే ఉపేక్షించేది లేదని, గతంలో ఉన్న భారత్ కాదని, ఇప్పుడు పరిస్థితుల్లో ఎంతో మార్పు వచ్చిందని ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు.

భారత భూభాగంపై కన్నేస్తే దీటైన సమాధానమిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మన్ కీ బాత్ లో మాట్లాడుతూ సరిహద్దు దేశం చైనాను ప్రధాని మోదీ ఇచ్చిన వార్నింగ్ ఇది. ఇది ఒకనాటి ఇండియా కాదని, ఇప్పుడు ఎంతో మార్పు వచ్చిందని గుర్తు చేసే ప్రయత్నం చేశారు.

స్నేహధర్మాన్ని భారతదేశం కచ్చితంగా పాటిస్తుందని అయితే అదే సమయంలో దేశంపై వక్రదృష్టితో చూసేవారికి దీటైన సమాధానం చెప్పడంలో కూడా వెనక్కి తగ్గేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

మన్ కీ బాత్ సందర్భంగా మోదీ పలు అంశాలపై కూలంకషంగా ప్రసంగించారు. ఇండో-చైనా సరిహద్దులో దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందన్నారు. గాల్వన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు దేశం తరఫున ప్రధాని మోదీ నివాళి అర్పించారు.

గల్వాన్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సైనికుల కుటుంబాలు తమ కుటుంబం నుంచి ఇంకా పిల్లల్ని ఆర్మీకి పంపాలని కోరుకుంటున్నట్టు మోదీ చెప్పారు. ఇది నిజంగానే గర్వించే అంశమన్నారు. గల్వాన్ సంఘటన ద్వారా దేశ సరిహద్దుల్ని కాపాడుకుంటున్న వైనాన్ని ప్రపంచం చూసిందన్నారు.

ఎన్ని సవాళ్లు ఎదురైనా సరే ముందుకు వెళ్లిన చరిత్ర భారతదేశానికుందని అలాగే ఇప్పుడీ విపత్కర పరిస్థితుల్లో ఆ సమస్యల్ని అధిగమించాల్సిన అసవరం ఉందన్నారు. మరోవైపు స్థానిక ఉత్పత్తుల ప్రాధాన్యతను ప్రధాని మోదీ మన్ కీ బాత్ ద్వారా మరోసారి గుర్తు చేశారు. వోకల్ ఫర్ లోకల్ ద్వారా దేశాభివృద్ధి సాధ్యమవుతుందని మోదీ అన్నారు.

Tags :

Advertisement