Advertisement

  • అటల్‌ సొరంగమార్గాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

అటల్‌ సొరంగమార్గాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ

By: chandrasekar Sat, 03 Oct 2020 3:42 PM

అటల్‌ సొరంగమార్గాన్ని ప్రారంభించిన  ప్రధాని నరేంద్ర మోదీ


భారత దేశానికే ప్రఖ్యాతిగాంచిన అటల్‌ సొరంగమార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హిమాచల్‌ ప్రదేశ్‌ రోహ్‌తాంగ్‌ పాస్‌ వద్ద నిర్మించిన అటల్‌ సొరంగమార్గాన్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. మనాలీ -లేహ్‌ మధ్య దీనిని నిర్మించారు. ఫిర్‌ ఫంజల్‌ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 3 వేల మీటర్లు(10 వేల అడుగులు) ఎత్తులో ఈ టన్నెల్‌ను నిర్మించారు. 9.02 కిలోమీటర్ల పొడవైన ఈ సొరంగ మార్గానికి మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టారు. చైనాతో వాస్తవాధీన రేఖ సమస్య దృష్ట్యా ఈ టన్నెల్‌ ప్రత్యేకతను సంతరించుకుంది.

సముద్ర మట్టానికి 10 అడుగుల ఎత్తులో నిర్మించడంవల్ల ప్రపంచంలోనే ఎతైన ప్రాంతంలో చేపట్టిన ఈ టన్నెల్‌ నిర్మాణానికి రూ.3,500 కోట్లు వెచ్చించారు. భౌగోళిక పరిస్థితులు, వాతావారణం కారణంగా నిర్మాణం పనులు ఆలస్యమయ్యాయి. జూన్‌ 3, 2000 సంవత్సరంలో నాటి ప్రధాని అటల్‌ బీహారీ వాజ్‌పేయ్‌ ఈ టన్నెల్‌ నిర్మాణానికి పచ్చజెండా ఊపారు. మే 26, 2002లో దీని నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. రోహ్‌తాంగ్‌ టన్నెల్‌కు 2019లో అటల్‌ టన్నెల్‌గా పేరు మారుస్తూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

ఈ ప్రారంభోత్సవంలో టన్నెల్‌ నిర్మాణంలో పాలుపంచుకున్న ప్రధాన సంస్థ అఫ్‌కోన్స్‌ (ఏఎఫ్‌సీఓఎన్‌ఎస్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ పరమశివన్‌ మాట్లాడుతూ జాతీయ రక్షణా కోణం దృష్ట్యా, అంతర్జాతీయంగానూ ఈ టన్నెల్‌ చాలా ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. అతి ఎతైన ప్రాంతంలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పొడవైనదిగా దీనికి గుర్తింపు ఉందని ఆయన పేర్కొన్నారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాప్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఛీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాప్ జ‌న‌ర‌ల్ ఎం.ఎం. నారావ‌నే తదితరులు ప్రధాని వెంట ఉన్నారు. ఈ సొరంగ మార్గాన్ని మోడీ జాతికి అంకితం చేసారు.

Tags :

Advertisement