Advertisement

  • దేశంలో పాత చట్టాలు ఇప్పుడు భారంగా మారాయ‌ని తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

దేశంలో పాత చట్టాలు ఇప్పుడు భారంగా మారాయ‌ని తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

By: chandrasekar Tue, 08 Dec 2020 08:51 AM

దేశంలో పాత చట్టాలు ఇప్పుడు భారంగా మారాయ‌ని తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ


దేశంలో పాత చట్టాలు ఇప్పుడు భారంగా మారాయ‌ని తెలిపిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. దేశ అభివృద్ధి కోసం సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌ర‌మ‌ని, గ‌త శ‌తాబ్దంలో చేసిన చ‌ట్టాలు ఇప్పుడు భారంగా మారాయ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అన్నారు. కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో రైతులు ఆందోళ‌న చేస్తున్న నేప‌థ్యంలో మోదీ వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ఆగ్రా మెట్రో రైలు ప్రాజెక్ట్ వ‌ర్చువ‌ల్‌ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు. అభివృద్ధి కోసం సంస్క‌ర‌ణ‌లు అవ‌స‌రం. కొత్త వ‌స‌తులు క‌ల్పించ‌డానికి సంస్క‌ర‌ణ‌లు చాలా అవ‌స‌రం. గ‌త శ‌తాబ్ద‌పు చ‌ట్టాల‌తో వ‌చ్చే శ‌తాబ్దాన్ని మ‌నం నిర్మించ‌లేము అని మోదీ స్ప‌ష్టం చేశారు. ఇందుకోసం చట్టాలు మార్చాలని తెలిపారు.

పాత చట్టాలు గ‌త శ‌తాబ్దంలో మంచిగా అనిపించిన ఇప్పుడు భారంగా మారాయ‌ని, సంస్క‌ర‌ణ‌లు నిరంత‌ర ప్ర‌క్రియ అని ఆయ‌న అన్నారు. త‌మ ప్ర‌భుత్వ సంపూర్ణంగా సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతోంద‌ని, గ‌తంలో కొన్ని రంగాలు, శాఖ‌ల వారీగానే సంస్క‌ర‌ణ‌లు జ‌రిగేవ‌ని మోదీ చెప్పారు. మంగ‌ళ‌వారం భార‌త్ బంద్‌కు రైతు సంఘాలు పిలుపునిచ్చిన నేప‌థ్యంలో వాళ్లు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్న‌ కొత్త వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను మోదీ స‌మ‌ర్థించుకోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే రైతులు, ప్ర‌భుత్వం మ‌ధ్య ఐదు విడ‌త‌లుగా చ‌ర్చ‌లు జ‌రిగినా ఇందుకోసం ఫ‌లితం లేకుండా పోయింది. రైతులు నిర్వహించే ఈ బంద్ కు చాలా పార్టీలు తమ మద్దతును తెలిపింది.

Tags :

Advertisement