Advertisement

  • అయోధ్య రామమందిర భూమిపూజలో ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్య రామమందిర భూమిపూజలో ప్రధాని నరేంద్ర మోదీ

By: chandrasekar Wed, 05 Aug 2020 2:55 PM

అయోధ్య రామమందిర భూమిపూజలో ప్రధాని నరేంద్ర మోదీ

దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అయోధ్యలో 28 ఏళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ అడుగుపెట్టారు. మందిర శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయనకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. లక్నో నుంచి హెలికాప్టర్‌లో అయోధ్యకు చేరిన ప్రధానికి హెలీప్యాడ్ వద్దకు వెళ్లి యోగి సాధారంగా ఆహ్వానించారు. హెలీప్యాడ్ నుంచి ఆలయ సమీపంలోని హనుమాన్‌గఢీకి వాహనంలో చేరుకున్న ప్రధాని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని వెంట యూపీ సీఎం యోగి వుంది అన్ని కార్యక్రమాలు పర్యవేక్షింశారు.

prime minister,narendra modi,ram mandir,bhumi puja,ayodhya ,అయోధ్య, రామమందిర, భూమిపూజ, ప్రధాని, నరేంద్ర మోదీ

మోదీ ఆంజనేయస్వామికి వెండి కిరీటాన్ని కానుకగా సమర్పించారు. హనుమాన్‌గఢీలో పూజల అనంతరం రామమందరి నిర్మాణ స్థలానికి ప్రధాని చేరుకుని అక్కడ రామ్‌లల్లా ఉత్సవ విగ్రహానికి ప్రార్థనలు చేశారు. భూమిపూజకు ముందు పారిజాతం మొక్కను నాటారు. అనంతరం శంకుస్థాపన క్రతువు నిర్వహించే ప్రదేశానికి చేరుకుని, కార్యక్రమాన్ని ప్రారంభించారు.

prime minister,narendra modi,ram mandir,bhumi puja,ayodhya ,అయోధ్య, రామమందిర, భూమిపూజ, ప్రధాని, నరేంద్ర మోదీ

యూపీ గవర్నర్ అనందీ బెన్ పటేల్, సీఎం యోగి, ఆర్ఎస్ఎస్ చీఫ్ తదితరులు పాల్గొన్నారు. రామమందిర నిర్మాణానికి అభిజిత్ ముహూర్తంలో శంకుస్థాపన జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 12.44 నిమిషాలకు వెండి ఇటుకను ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠ చేసారు. శంకుస్థాపనకు తొమ్మిది ఇటుకలను సిద్ధం చేశారు.

prime minister,narendra modi,ram mandir,bhumi puja,ayodhya ,అయోధ్య, రామమందిర, భూమిపూజ, ప్రధాని, నరేంద్ర మోదీ

1989లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామ భక్తులు పంపారు. అలాంటివి 2.75 లక్షల ఇటుకలు ఉన్నాయి. వీటిలో 100 ‘జై శ్రీ రామ్’పేరు చెక్కినట్టు ఈ కార్యక్రమానికి ప్రధాని పూజారిగా వ్యవహరిస్తున్న పూజన్ తెలిపారు. భూమిపూజ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖులు ఇప్పటికే అక్కడికి చేరుకున్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, యోగా గురువు రామ్‌దేవ్‌, స్వామి అవ్‌దేశానంద్‌ గిరి, చిదానంద్‌ మహరాజ్‌తో పాటు పలువురు ఆహ్వానితులు వేదిక వద్దకు చేరుకున్నారు.

prime minister,narendra modi,ram mandir,bhumi puja,ayodhya ,అయోధ్య, రామమందిర, భూమిపూజ, ప్రధాని, నరేంద్ర మోదీ

ప్రతిష్టాత్మకమైన అయోధ్యలోని రామమందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి బయల్దేరి వెళ్లారు. మొదట హనుమాన్‌గఢీ ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 12 గంటలకు భూమిపూజ ప్రదేశానికి చేరుకుంటారు. 12.30 గంటల నుంచి 12.45 వరకు రామమందిరం భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. భూమి పూజకు ముందు పారిజాత మొక్కను నాటారు.

prime minister,narendra modi,ram mandir,bhumi puja,ayodhya ,అయోధ్య, రామమందిర, భూమిపూజ, ప్రధాని, నరేంద్ర మోదీ

అయోధ్యలోని రామమందిర భూమి పూజ కారణంగా ఉగ్రవాదులు బెదిరింపుల నేపథ్యంలో పటిష్ట భద్రత కల్పించారు. 45 ఏళ్లలోపు ఉండి కరోనా నెగిటివ్‌ వచ్చిన వారికే ప్రధాని భద్రతా బృందంలో చోటు కల్పించారు. అయోధ్యను ఆనుకుని ఉన్న 9 జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అయోధ్య-నేపాల్‌ సరిహద్దు బస్తీ డివిజన్‌లో ప్రత్యేక ఆంక్షలు విధించారు. సరిహద్దు ప్రాంతాలు, జలమార్గాలపై భద్రతా బలగాలు నిఘా పెంచాయి. ప్రపంచం మొత్తం దృష్టి భారత్‌వైపే ఉంది. రామమందిర నిర్మాణం శంకుస్థాపన కార్యక్రమం దేశానికే ప్రత్యేకమైనది.

Tags :

Advertisement