Advertisement

  • ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

By: chandrasekar Fri, 09 Oct 2020 09:35 AM

ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో ప్రసంగించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ


ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు. అయన పలు కీలక విషయాలు ప్రస్తావించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సాయంత్రం ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సమావేశంలో వర్చువల్ మాధ్యమంలో పాల్గొన్న ప్రధాని భారత దేశంలో కేనడా వ్యాపారావేత్తలు పెట్టుబడి పెట్టేందుకు ఎన్ని అనుకూలమైన అంశాలు ఉన్నాయని తెలిపారు.

ఇన్వెస్ట్ ఇండియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడిన విషయాల్లో కీలకమైన అంశాలు:

* ఈ సమావేశంలో పాల్గొన్నవారిలో ఒక కామన్ విషయం ఉంది. ఇక్కడ పెట్టుబడిని పెట్టేందుకు నిర్ణయం తీసుకునే అధికారం ఉన్న వ్యక్తులు ఉన్నారు.

* ఫార్మా రంగంలో భారతదేశం వాటా, పాత్ర కీలకం. ఇప్పటి వరకు మేము 150 దేశాలకు మందులు, ఇతర వైద్యోపకరణాలు సరఫరా చేశాం.

* భారత్-కెనడా మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు అనేవి సమాంతరమైన ప్రజాస్వామ్య విలువలపై, ఇరు పక్షాల సహజ ఆసక్తులపై ఆధారపడి ఉన్నాయి.

* నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను ఒక దేశంలో పెట్టుబడి పెట్టడానికి ముందు మీరు ఏం ఆలోచిస్తారు? ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా? రాజకీయంగా అలజడులు లేని దేశమా కాదా? పెట్టుబడికి అనుకూలంగా ఉన్న దేశమా కాదా? ఆ దేశంలో తగిన స్కిల్స్ ఉన్న మానవ వనరులు ఉన్నాయా లేదా? మీ మదిలో మెదిగే ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒకటే సమాధానం అదే భారత దేశం అని అన్నారు.

* భారత్-కెనాడా మధ్య వాణిజ్యం, పెట్టుబడులు అనేవి మన బంధాల్లో భాగంగా జరిగేవి మాత్రమే.

* కోవిడ్-19 సమస్య తగ్గిన తరువాత ఎన్నో సమస్యలు కంటిముందు కనిపిస్తాయి. అందులో చాలా వాటికి పరిష్కారం భారత్ వద్దే ఉంటుంది. అంటే సప్లై చేయిన్, పీపీఈ కిట్స్ వంటి విషయంలో భారత్ ప్రపంచానికి ఆధారంగా మారింది.

* ఈ ఏడాది మార్చి-జూన్ మధ్యలో వ్యవసాయ ఎగుమతులు 23 శాతం పెరిగాయి అని తెలిపారు.

భారతదేశం అన్ని రంగాల్లో ఆర్ధికంగా దేసుకెళుతున్నట్లు తెలిపారు.

Tags :
|

Advertisement