Advertisement

  • జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

By: chandrasekar Tue, 08 Sept 2020 7:47 PM

జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ


ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ సినీ, రంగస్థల నటుడు జయప్రకాష్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు. జయప్రకాష్ రెడ్డి తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారని ప్రధాని మోదీ తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం.

‘‘జయప్రకాష్ రెడ్డి గారు తనదైన ప్రత్యేక నటనా శైలితో అందరినీ ఆకట్టుకున్నారు. తన దీర్ఘ కాల సినీ యాత్రలో ఆయన ఎన్నో మరపురాని పాత్రలు పోషించారు. వారి మరణం సినిమా ప్రపంచానికి తీరని లోటు. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నాను. ’’అని ప్రధాని తన ట్వీట్‌లో తెలిపారు.

చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆయనకు ఆసక్తి. డిగ్రీ తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని గణితం ఉపాధ్యాయుడిగా ఉద్యోగంలో చేరారు. జయప్రకాష్ రెడ్డికి దాసరి నారాయణరావు తొలుత అవకాశం ఇచ్చారు. జయప్రకాష్ రెడ్డి 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1988లో విడుదలైన ‘బ్రహ్మపుత్రుడు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు జయప్రకాష్ రెడ్డి. ఇక, 1997లో విడుదలైన ‘ప్రేమించుకుందాం రా’ చిత్రం విలన్‌గా జయప్రకాష్ రెడ్డికి మంచి పేరు తీసుకునివచ్చింది.

తరువాత బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’ లాంటి విజయవంతమైన సినిమాల్లో విలన్‌గా నటించారు. కేవలం విలన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

Tags :
|
|
|

Advertisement