Advertisement

  • ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రసూతి, శిశు సంబంధ ఆరోగ్య సమస్యల అడ్డుకట్ట

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రసూతి, శిశు సంబంధ ఆరోగ్య సమస్యల అడ్డుకట్ట

By: chandrasekar Tue, 20 Oct 2020 09:35 AM

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సహాయంతో ప్రసూతి, శిశు సంబంధ ఆరోగ్య సమస్యల అడ్డుకట్ట


ప్రపంచవ్యాప్తంగా ప్రసూతి, శిశు సంబంధ ఆరోగ్య సమస్యలను ముందుగానే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సహాయంతో గుర్తించడం వీలవుతుంది. వ్యాధులను ముందుగా గుర్తించడంలో అధునాతన సాంకేతికత జోడించి పరిష్కారాలు అభివృద్ధి చేస్తున్న అమెరికాకు చెందిన కాగ్నిటివ్‌ కేర్‌ మరొక ముందడుగు వేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)తో కూడిన మిహిక్‌ (మెటర్నల్‌ ఇన్‌ఫెంట్‌ హెల్త్‌ ఇన్‌సైట్స్‌ అండ్‌ కాగ్నిటివ్‌ ఇంటెలిజెన్స్‌) అనే ప్లాట్‌ఫాంను ప్రారంభించింది.

ఈ కొత్త టెక్నాలజీ ద్వారా మెడికల్‌, క్లినికల్‌, జెనెటిక్‌, రేడియోలాజికల్‌, సోషల్‌ వంటి అంశాల విశ్లేషణ ద్వారా ప్రసూతి, శిశు సంబంధ ఆరోగ్య సమస్యలను ముందే అంచనా వేయడం దీంతో సాధ్యం కానుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఏఐ సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేసినట్లు కాగ్నిటివ్‌ కేర్‌ బాధ్యులు తెలిపారు. ఆరోగ్య సంరక్షణలో ఎదురయ్యే ప్రాథమిక సమస్యలను నివారించడం, పరిష్కరించడం దీంతో సులువు కానుందన్నారు.

కాగా.. కాగ్నిటివ్‌ కేర్‌ సీఈ వో వెంకటనరసింహం పెరి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 800 ప్రసూతి మరణాలు సంభవిస్తున్నాయని, మరికొందరు క్లిష్టమైన ఆరోగ్య స్థితికి చేరుతున్నారని చెప్పా రు. సమస్యను ముందుగా గుర్తించడం వల్ల మూడులో రెండో వంతు ప్రసూతి, శిశు మరణాలను అరికట్టవచ్చని తెలిపారు.

Tags :

Advertisement