Advertisement

  • కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరు మార్పుకు రాష్ట్రపతి ఆమోదముద్ర

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరు మార్పుకు రాష్ట్రపతి ఆమోదముద్ర

By: Sankar Tue, 18 Aug 2020 12:37 PM

కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ పేరు మార్పుకు రాష్ట్రపతి ఆమోదముద్ర


కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) పేరును విద్యాశాఖగా మార్చగా రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ ఆమోద ముద్ర వేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌పీఈ)లో కీలక సిఫారసుల్లో పేరు మార్పు కూడా ఒకటి. గత నెలలో కేంద్ర కేబినెట్‌ దీనికి ఆమోద ముద్రవేసి రాష్ట్రపతికి పంపారు. ఈ మేరకు సోమవారం రాత్రి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు.

కాగా, రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1985లో విద్యామంత్రిత్వశాఖ పేరు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖగా మార్చారు. తర్వాత సంవత్సరం ఎన్‌ఈపీని ప్రవేశపెట్టగా.. 1992లో సవరణలు చేశారు. రాజీవ్‌గాంధీ మంత్రివర్గంలో పీవీ నరసింహరావు తొలి హెచ్‌ఆర్‌డీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం తీసుకురాగా..

ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ నేతృత్వంలోని ప్యానెల్ తొలుత మంత్రిత్వ శాఖ పేరును మార్చాలని ప్రతిపాదించింది. 2018లో ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ చైర్మన్‌ రామ్‌ బహదూర్‌ రాయ్‌ సైతం విద్యాశాఖ పేరు మార్చాలని సూచించారు.

Tags :
|
|

Advertisement