Advertisement

శ‌త్రు దేశాలను ఎదుర్కొనేందుకు సిద్ధం...

By: chandrasekar Mon, 14 Dec 2020 8:45 PM

శ‌త్రు దేశాలను ఎదుర్కొనేందుకు సిద్ధం...


టిబెట్ అటాన‌మ‌స్ రీజియ‌న్‌లో చైనా సేన‌ల క‌ద‌లిక‌లు ఎక్కువవుతుండ‌టంతో లడక్ ‌లో ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్పడ్డాయని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావ‌త్ చెప్పారు. శ‌త్రు దేశాల నుంచి ఎలాంటి ప‌రిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ఆయన అన్నారు. స‌రిహ‌ద్దుల్లో ఏం జ‌రిగినా స‌మ‌ర్థంగా ఎదుర్కోనేందుకు ఎప్పుడు రెడీగా ఉన్నామ‌నే విష‌యాన్ని దేశ ప్ర‌జ‌ల‌కు చెపాలనుకున్నాన‌ని ఆయ‌న పేర్కొన్నారు.

మీడియా ప్ర‌తినిధులు బిపిన్ రావత్ ముందు నియంత్ర‌ణ రేఖ వెంబ‌డి పాకిస్థాన్ సైన్యం త‌ర‌చూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న ఆంశాన్ని ప్ర‌స్తావించ‌గా సాంకేతి ప‌రిజ్ఞానం నిండిన వ్య‌వ‌స్థ‌లను ఉప‌యోగించి భ‌విష్య‌త్ యుద్ధాలు చేయ‌డం చూసే స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని రావ‌త్ అన్నారు. పొరుగు దేశం చ‌ర్య‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయ‌ని, అయితే వాళ్లు ఎన్ని అరాచకాలు చేసిన ఎదిరించడానికి ఎప్పుడు రెడీగా ఉన్నామ‌ని ఆయన అన్నారు.

Tags :
|

Advertisement