Advertisement

  • సంతాన సమస్యలను దూరం చేసేందుకు కృత్రిమ వీర్యం సిద్ధం..

సంతాన సమస్యలను దూరం చేసేందుకు కృత్రిమ వీర్యం సిద్ధం..

By: chandrasekar Tue, 21 July 2020 5:05 PM

సంతాన సమస్యలను దూరం చేసేందుకు కృత్రిమ వీర్యం సిద్ధం..


సంతాన సమస్యలను దూరం చేసేందుకు అమెరికాలోని శాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ వైద్యులు ఏకంగా కృత్రిమ వీర్యాన్నే సిద్ధం చేశారు. పురుషులతో పనిలేకుండా కేవలం లేబోరేటరీలోనే ఈ వీర్యాన్ని సిద్ధం చేయడం గమనార్హం. సంతాన సమస్యలు ఎదుర్కొంటున్న పురుషులకు భవిష్యత్తులో ఈ కృత్రిమ వీర్యంతో పరిష్కారం లభించనుంది.

యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా సాన్ డియాగో స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకులు మనుషుల్లో ఉండే స్పెర్మాటోగోనియల్ స్టెమ్ సెల్స్ ల్యాబ్‌లోనే అభివృద్ధి చేశారు. SSC ప్రతి సెకనుకు వెయ్యికి పైగా స్పెర్మ్ (శుక్రము), మూల కణాలను ఉత్పత్తి చేయగలరు.

అయితే, పురుషుల వృషణాల్లో ఉండే ఇతరాత్ర కణాలను కృత్రిమంగా తయారు చేయడంలోనే ఇన్నాళ్లు సమస్యలు తలెత్తాయి. అయితే, ఇప్పుడు ఆ సమస్యను కూడా పరిశోధకులు అధిగమించారు. USCD అనే మరో పరిశోధకుల బృందం, మరికొన్ని ల్యాబోరేటరీలు సంయుక్తంగా సింగిల్ సెల్ ఆర్ఎన్ఏ ద్వారా వీర్యం తయారీని సులభతరం చేశారు.

ప్రపంచంలో ప్రతి ఏడుగురు పురుషుల్లో ఒకరు సంతాన సమస్యను ఎదుర్కొంటున్నారు. వీర్యంలో నాణ్యత లేకపోవడం, స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటం తదితర కారణాలు వీరిని వేధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అండాలతో ఫలదీకరణానికి అవసరమైన స్పెర్మ్ తయారీపై పరిశోధకులు దృష్టిపెట్టారు. ఈ సందర్భంగా మూల కణాలను టెస్ట్ ట్యూబ్ లో ఉంచి వీర్యా కణాలను డెవలప్ చేశారు. అలాగే ఆర్ఎన్ఏ సీక్వెన్సింగ్ అనలైజ్ కూడా చేపట్టారు. ఫలితంగా కృత్రిమ వీర్యం తయారీ సాధ్యమైనట్లు అధ్యయనంలో పేర్కొన్నారు.

Tags :
|

Advertisement