Advertisement

  • కరోనా రోగులకు గుర్రాలలోని యాంటీబాడీస్ తో చికిత్సకు సన్నాహాలు

కరోనా రోగులకు గుర్రాలలోని యాంటీబాడీస్ తో చికిత్సకు సన్నాహాలు

By: chandrasekar Mon, 21 Sept 2020 10:44 AM

కరోనా రోగులకు గుర్రాలలోని యాంటీబాడీస్ తో చికిత్సకు సన్నాహాలు


అమెరికన్ శాస్త్రవేత్తలు కరోనా వైరస్ కు గురైన మానవులకు గుర్రాలలోని యాంటీబాడీస్ తో చికిత్స చేయడానికి సన్నాహాలు పూర్తి చేశారు. ఈ నెలలో 26 మంది వైరస్ కు గురైన రోగులను పరిక్షలు చేయనున్నారు. వ్యాప్తిని తగ్గించడం, రోగుల పరిస్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కోస్టారికా విశ్వవిద్యాలయంలో జరుగుతున్న పరిశోధనల ప్రకారం ట్రయల్స్ ఫలితాలు ప్రభావవంతంగా ఉన్నట్లుగా రుజువు అయినట్లైతే హాస్పిటల్స్ లో పెద్ద ఎత్తున చికిత్స చేసే అవకాశాలు ఉంటాయి. చైనా, బ్రిటన్ దేశాల్లో కరోనా వైరస్ సోకిన గుర్రాలను తెప్పించి పరోశోధనలు చేపట్టారు. వీటికి చికిత్స అందించిన కొన్ని వారాల తరువాత వాటిలో తగినంత యాంటీబాడీస్ సిద్ధంగా ఉంటాయి. అప్పుడు వాటి రక్తం నుంచి ప్లాస్మాను వేరుచేసి తీసుకుని అందులో ఉండే యాంటీబాడీస్ లను కరోనా బాధితులకు వేస్తారు. ఈ యాంటీబాడీస్ కరోనాతో పోరాడటానికి, వైరస్ ను శరీరం నుంచి తొలగించేందుకు రోగనిరోధక శక్తిని, ప్రతిస్పందనను పెంచుతాయి. ప్రస్తుతం 26 మంది వైరస్ సోకిన వారిపై పరీక్షలు జరుపుతున్నారు.

క్లోడిమిరో పికాడో ఇనిస్టిట్యూట్‌లో ట్రయల్స్ కొనసాగుతుందని ప్రాజెక్ట్ హెడ్ అల్బెర్టో ఆల్ప్ తెలిపారు. టీకా ప్రవేశపెట్టే వరకు ఈ చికిత్స పని చేస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్ట్ హెడ్ అల్బెర్టో ప్రకారం కొన్నేండ్లుగా గుర్రాల యాంటీబాడీస్ తో పాము విషం విచ్ఛిన్నం చేస్తున్నారు. దీని నుంచి యాంటీ-వీనం తయారుచేస్తారు. గుర్రాల యాంటీబాడీస్ తో కరోనా వైరస్ ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మధ్య అమెరికాలోని పేద వర్గాలకు ఉపశమనం లభిస్తుంది. గుర్రాల యాంటీబాడీస్ తో ప్రయోగానికి ముందు లామా అనే జంతువు యొక్క ప్రతిరోధకాలతో కూడా కరోనా వైరస్ ను శరీరంలో నుంచి దూరం చేయవచ్చునని నిరూపితమయ్యాయి. గత వారం స్వీడన్ పరిశోధకులు కరోనాను నిరోధించే సామర్ధ్యం కలిగిన నానోబాడీలను కూడా కనుగొన్నారు. నానోబాడీలను స్టాక్‌హోమ్‌లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్‌లోని 12 ఏండ్ల జంతువు అప్లికా నుండి సేకరించారు. ఇది వైరస్ ప్రోటీన్ కలిగిన కరోనా రోగికి ఇంజెక్ట్ చేయబడింది. ఈ పరిశోధన పూర్తయినప్పటికీ ఫలితాలు ఇంకా రాలేదు.

Tags :

Advertisement