Advertisement

  • దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం,షేక్‌ జాయేద్‌ స్టేడియం, షార్జా గ్రౌండ్‌లో 'ఐపీఎల్"‌ సన్నాహాలు; బ్రిజేష్‌ పటేల్‌

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం,షేక్‌ జాయేద్‌ స్టేడియం, షార్జా గ్రౌండ్‌లో 'ఐపీఎల్"‌ సన్నాహాలు; బ్రిజేష్‌ పటేల్‌

By: chandrasekar Sat, 25 July 2020 10:02 AM

దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం,షేక్‌ జాయేద్‌ స్టేడియం, షార్జా గ్రౌండ్‌లో 'ఐపీఎల్"‌ సన్నాహాలు;  బ్రిజేష్‌ పటేల్‌


ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి షెడ్యూల్‌పై స్పష్టత వచ్చింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) వేదికగా సెప్టెంబర్‌ 19న లీగ్‌ ఆరంభంకానుందని నవంబర్‌ 8న ఫైనల్‌తో టోర్నీ ముగియనుందని ఐపీఎల్‌ ఛైర్మన్‌ బ్రిజేష్‌ పటేల్‌ శుక్రవారం క్లారిటీ ఇచ్చారు. ఈసారి పూర్తిస్థాయి టోర్నమెంట్‌ను నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. ఐపీఎల్‌ షెడ్యూల్‌, విధి విధానాలు తదితర అంశాలపై వచ్చే వారం జరిగే ఐపీఎల్‌ పాలకమండలి సమావేశంలో ఖరారు చేయనుంది. ఐపీఎల్‌కు సంబంధించిన పలు వివరాలను ఇప్పటికే బీసీసీఐ ఫ్రాంఛైజీలకు తెలియజేసినట్లు సమాచారం.

'గవర్నింగ్‌ కౌన్సిల్‌ త్వరలోనే సమావేశమై షెడ్యూల్‌ను ఖరారు చేస్తుంది. లీగ్‌ సెప్టెంబర్‌ 19 నుంచి నవంబర్‌ 8 వరకు జరుగుతుంది. విదేశాల్లో లీగ్‌ నిర్వహణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. ప్రభుత్వ అనుమతి త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం. అనుమతి రాగానే పాలక మండలి సమావేశం నిర్వహిస్తాం. ఈసారి ఐపీఎల్‌ 51 రోజుల పాటు జరగనుందని' బ్రిజేష్‌ పేర్కొన్నారు.

'స్టేడియాల్లోకి ప్రేక్షకులను అనుమతించాలా వద్దా అనేది యూఏఈ ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా భౌతిక దూరం ప్రతిఒక్కరూ పాటించాల్సిందే. దీనిపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని ఆ ప్రభుత్వానికి వదిలేశాం. అధికారికంగా యూఏఈ బోర్డుకు కూడా లేఖ రాయనున్నట్లు' పటేల్‌ తెలిపారు. యూఏఈలో మూడు క్రికెట్‌ మైదానాలు అందుబాటులో ఉన్నాయి. దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియం, షేక్‌ జాయేద్‌ స్టేడియం(అబుదాబి), షార్జా గ్రౌండ్‌లో ఐపీఎల్‌ నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తోంది.

Tags :

Advertisement