Advertisement

  • కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం ఫ్రంట్ లైన్ వర్కర్స్ జాబితా తయారీ

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం ఫ్రంట్ లైన్ వర్కర్స్ జాబితా తయారీ

By: chandrasekar Fri, 04 Dec 2020 5:26 PM

కరోనా వైరస్ వ్యాక్సినేషన్ కోసం ఫ్రంట్ లైన్ వర్కర్స్ జాబితా తయారీ


కరోనా వైరస్ బారినుండి కాపాడుకొనుటకు ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు వాక్సిన్ అందించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ -19 వ్యాక్సినేషన్ నిమిత్తం మొదటి ప్రాధాన్యతగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ అయిన ఆరోగ్య కార్యకర్తలు, పోలీస్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో కూడిన డేటా బేస్‌ను తయారు చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. సీఎస్ అధ్య‌క్ష‌త‌న‌ రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటి తొలి సమావేశం న‌గ‌రంలోని బీ.ఆర్.కే.ఆర్ భవన్‌లో గురువారం జరిగింది. రాష్ట్రంలో కోవిడ్ -19 వ్యాక్సినేషన్ సన్నద్ధతపై కమిటీ చర్చించింది. వీరికి వాక్సిన్ అందించుటపై చర్చ జరపబడింది.

ఇందుకోసం కమిటీలో సీఎస్ మాట్లాడుతూ కొవిడ్ -19 మొదటి దశ వ్యాక్సినేషన్ కోసం సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించి కోల్డ్ చైన్ సౌకర్యాలు, రవాణా, వైద్య సిబ్బంది శిక్షణ, లాజిస్టికల్ ఏర్పాట్లు, ఐ.ఇ.సి. ప్రచారం, వైద్య సౌకర్యాల మ్యాపింగ్ తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. వ్యాక్సినేషన్ సెంటర్ల నిర్వహణకు అవసరమైన ప్రోటోకాల్‌ను తయారుచేయాలని ఆదేశించారు. అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడంవల్ల త్వరిత గతిన వాక్సినేషన్ పూర్తి చేయవచ్చని తెలిపారు.

Tags :

Advertisement