Advertisement

  • అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీమ్ యజమాని ప్రీతి జింటా

అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీమ్ యజమాని ప్రీతి జింటా

By: chandrasekar Mon, 21 Sept 2020 5:05 PM

అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీమ్ యజమాని ప్రీతి జింటా


ఉత్కంఠభరితంగా సాగిన ఐపీఎల్ మ్యాచ్ ఫై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మద్య జరిగిన మ్యాచ్ లో అంపైర్ నిర్ణయంపై టీమ్ యజమాని ప్రీతి జింటా ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రికెట్ ప్రేమికులు ఎదురు చూసిన ఐపీఎల్ 2020 లో రెండవ మ్యాచ్ సర్వత్రా ఉత్కంఠత రేపింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ టై గా ముగియడంతో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. చివరికి ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. అయితే సూపర్ ఓవర్ ఆడాల్సి రావడం వెనుక అంపైర్ తప్పుడు నిర్ణయ౦ కారణం అనే విమర్శలు వస్తున్నాయి.

క్రికెట్ విశ్లేషకులు అంపైర్ నిర్ణయం పూర్తిగా తప్పు అని అంటున్నారు. ఛేజింగ్ చేస్తున్న పంజాబ్ జట్టు సూపర్ ఓవర్ కు ముందే విజయం ఖరారు చేసుకోవల్సిన పరిస్థితి. 19వ ఓవర్ లో ఫీల్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వారి కొంపముంచింది. రబాడ బౌలింగ్ లో 19వ ఓవర్ మూడవబంతిని ఆడిన మయాంక్ వాస్తవానికి రెండు పరుగులు తీశాడు. అవతలి ఎండ్ లో ఉన్న క్రిస్ జోర్డాన్ తన బ్యాటును క్రీజ్ లో పెట్టలేదనే కారణంగా లెగ్ అంపైర్ నితిన్ మీనన్ మొత్తం స్కోర్ నుంచి ఒక పరుగును తొలగించారు. దాంతో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ నిర్ణయంపైనే సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ జట్టు యజమాని ప్రీతి జింటా ట్విట్టర్ సాక్షిగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

కరోనా సోకిన తాను ఆరు రోజుల హోం క్వారంటైన్ ను ఆనందంగా పూర్తి చేసుకున్నా షార్ట్ రన్ తనను తీవ్రంగా దెబ్బతీసిందని ప్రీతి జింటా చెప్పారు. క్రికెట్ లో టెక్నాలజీను వినియోగించుకోలేకపోతే ప్రయోజనం ఏంటని ప్రశ్నించారు. బీసీసీఐ కొత్త నిబంధనల్ని ప్రవేశపెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. గెలుపోటముల్ని సమానంగా స్వీకరించే తనకు అంపైర్ నిర్ణయం మింగుడుపడటం లేదన్నారు. క్రికెట్ నిబంధనల్లో మార్పులు తీసుకురావడం ద్వారా భవిష్యత్ లో మళ్లీ తప్పులు జరగకుండా చూడాలన్నారు.

Tags :

Advertisement