Advertisement

  • చున్నీ బైక్ చక్రంలో ఇరుక్కొని ఏడు నెలల గర్భవతి మృతి ..

చున్నీ బైక్ చక్రంలో ఇరుక్కొని ఏడు నెలల గర్భవతి మృతి ..

By: Sankar Fri, 24 July 2020 2:02 PM

చున్నీ బైక్ చక్రంలో ఇరుక్కొని ఏడు నెలల గర్భవతి మృతి ..



మహిళలు బైక్ మీద కుర్చునేపుడు డ్రెస్ చున్నీ , చీర కొంగులను సరిగా వేసుకోకపోవడాం వలన అవి బైక్ చక్రాలలో ఇరుక్కుపోయి ప్రమాదాలు జరిగిన సంఘటనలు అనేకం చూసాం ..అయితే ఏడు నెలల గర్భవతి అయిన ఒక మహిళా అలాగే చున్నీ చక్రాలలో ఇరుక్కొని చనిపోయిన ఘటన ఆంధ్ర ప్రదేశ్లోని ఒంగోలులో జరిగింది ..ఏడునెలల గర్భంతో ఉన్న ఆమె వైద్య పరీక్షల కోసం భర్తతో కలిసి బైక్ ఆస్పత్రికి వెళ్తూ ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.

తిమ్మసముద్రానికి చెందిన చాట్రగడ్డ సుమ(22), సంతనూతలపాడుకు చెందిన మోషకు గతేడాది ఆగస్టులో వివాహం జరిగింది. కొద్దిరోజేలకే సుమ గర్భం దాల్చింది. దీంతో ప్రతి నెలా ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటోంది. ఏడో నెల గర్భంతో ఉన్న ఆమె గురువారం భర్తతో కలిసి ఒంగోలులోని ఆస్పత్రికి బయలుదేరింది. ఈ క్రమంలోనే రెడ్డిపాలెం వద్ద ఆమె చున్నీ చక్రంలో ఇరుక్కోవడంతో బైక్ అదుపుతప్పి భార్యభర్తలు కింద పడిపోయారు. సుమ తలకు తీవ్రగాయం కావడంతో భర్త వెంటనే ఆటోలో సంతనూతలపాడు ఆస్పత్రికి తరలించాడు.

ప్పటికే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్లు ఒంగోలు తరలించాలని సూచించారు. దీంతో భర్త ఆమెను వెంటనే ఒంగోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించాడు. ఆమెను పరీక్షించిన డాక్టర్లు సుమ అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. మరో రెండు నెలల్లో సందడితో కళకళ్లాడాల్సిన ఆ ఇంట సుమ మరణం తీరని విషాదం నింపిం

Tags :
|
|

Advertisement