Advertisement

  • భార‌తీయ నౌకాద‌ళంలోకి అమెరికాకు చెందిన ప్రిడేట‌ర్ డ్రోన్లు

భార‌తీయ నౌకాద‌ళంలోకి అమెరికాకు చెందిన ప్రిడేట‌ర్ డ్రోన్లు

By: chandrasekar Thu, 26 Nov 2020 11:37 AM

భార‌తీయ నౌకాద‌ళంలోకి అమెరికాకు చెందిన ప్రిడేట‌ర్ డ్రోన్లు


మన నౌకాదళాన్ని మరింత బలోపేతం చేయడానికి అమెరికాకు చెందిన ప్రిడేట‌ర్ డ్రోన్లను తెప్పించారు. భార‌త్ మరియు అమెరికా మ‌ధ్య ఇప్పుడు ర‌క్ష‌ణ బంధం మ‌రింత బ‌ల‌ప‌డింది. చైనాతో ఉన్న వైరం కార‌ణంగా ఈ రెండు దేశాలు ద‌గ్గ‌ర‌వుతున్నాయి. అయితే ఈ నేప‌థ్యంలో అమెరికాకు చెందిన ప్రిడేట‌ర్ డ్రోన్ల‌ను భార‌త్ కు తెచ్చుకున్న‌ది. లీజు ప‌ద్ధ‌తిలో ఆ డ్రోన్ల‌ను భార‌తీయ నౌకాద‌ళం వినియోగించ‌నున్న‌ది.

ప్రస్తుతం చైనాతో స‌రిహ‌ద్దు వివాదం నెల‌కొన్న నేప‌థ్యంలో రెండు ప్రిడేట‌ర్ డ్రోన్ల‌ను భార‌తీయ నౌకాద‌ళం తెచ్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ డ్రోన్లు హిందూ మ‌హాస‌ముద్రంతో పాటు ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లోని వాస్త‌వాధీన రేఖ వ‌ద్ద నిఘా పెట్ట‌నున్నాయి. ఎమ‌ర్జెన్సీ ప్రొక్యూర్మెంట్‌లో భాగంగా ఈ డ్రోన్ల‌ను తీసుకువ‌చ్చారు. న‌వంబ‌ర్ రెండ‌వ వారంలో ఈ డ్రోన్లు ఇండియాకు వ‌చ్చాయి.

తెప్పించిన ఈ డ్రోన్లు న‌వంబ‌ర్ 21న ఫ్ల‌యింగ్ ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టాయి. ఇండియ‌న్ నేవీ బేస్ ఐఎన్ఎస్ రాజాలీ నుంచి డ్రోన్ల ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. సుమారు 30 గంట‌ల పాటు గాలిలో విహ‌రించే సామ‌ర్థ్యం ఈ డ్రోన్ల‌కు ఉన్న‌ది. ప్ర‌స్తుతం ఏడాది కోసం లీజు తీసుకున్నారు. మ‌రో 18 డ్రోన్ల‌ను తెప్పించుకోవాల‌ని భార‌తీయ ర‌క్ష‌ణ ద‌ళాలు చూస్తున్నాయి. దీనివల్ల మన నిఘా వ్యవస్థ మరింత పెరుగుతుంది.

Tags :
|
|

Advertisement