Advertisement

కండ్లద్దాల విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు

By: chandrasekar Tue, 01 Sept 2020 6:47 PM

కండ్లద్దాల విషయం లో తీసుకోవలసిన జాగ్రత్తలు


కరోనా వైరస్‌ సంక్షోభంలో బయటికి వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్‌, కండ్లద్దాలు ధరించడం తప్పనిసరి. వైరస్‌ కళ్లలోకి ప్రవేశించకుండా నివారించడానికి ఈ కండ్లద్దాలు ఉపయోగపడతాయి. దృష్టి సమస్యలకు పెట్టుకునే కండ్లద్దాలైనా రక్షిస్తాయి. మాస్క్‌లైతే వాడి పారేస్తాం. లేకుంటే శుభ్రపరుచుకుంటాం. కానీ కండ్లద్దాల విషయంలో పెద్దగా పట్టించుకోం. కండ్లద్దాలపై కరోనా వంటి వైరస్‌లు 9 రోజుల పాటు ఉండవచ్చని అధ్యయనాలు తెలుపుతున్నాయి. అందుకే చేతుల మాదిరిగానే కండ్లద్దాలను కూడా శుభ్రపరుచుకోవాలి. అదెలాగంటే తరచుగా కండ్లద్దాలను తాకకూడదు.

కండ్లద్దాలను తీసే సమయంలో రెండు చేతులనూ ఉపయోగించండి. లెన్సుల అంచులను తాకకుండా కణతల వద్ద పెట్టుకోండి. పెట్టుకునే ముందు ప్రతిసారీ శుభ్రపరచండి. ఇందుకోసం గిన్నెలు కడిగే సబ్బు, నీటిని కూడా ఉపయోగించవచ్చు. కడిగిన వెంటనే మరకలు, గీతలు పడకుండా ఉండటం కోసం వెంటనే మైక్రోఫైబర్‌ బట్టతో తుడవండి. బయటికి వెళ్లేటప్పుడు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ద్రావణంతో శుభ్రపరచండి. లెన్సులు, ఫ్రేములను శుభ్రపరచడానికి కండ్లద్దాల షాపుల్లో దొరికే బ్రాండెడ్‌ లెన్స్‌ స్ప్రేలు కూడా ఉపయోగించవచ్చు. చేతులను శుభ్రపరిచే శానిటైజర్లతో కళ్లద్దాలు శుభ్రపరచవద్దు. దీనివల్ల లెన్సులు దెబ్బతింటాయి. అమ్మోనియా, బ్లీచ్‌, నిమ్మరసం, వెనిగర్‌ లాంటి ఆమ్ల పదార్థాలు కూడా వాడవద్దు.

Tags :
|
|

Advertisement