Advertisement

  • ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబె

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబె

By: chandrasekar Tue, 20 Oct 2020 09:28 AM

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబె


ఐపీల్ మ్యాచ్ లలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అమిత్ మిశ్రా స్థానంలో ప్రవీణ్ దూబె ను తీసుకున్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి కొత్త ఆటగాడు వచ్చాడు. గాయం కారణంగా ఐపీల్ 2020 నుంచి వైదొలగిన లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా స్థానంలో మరో లెగ్ స్పిన్నర్ ప్రవీణ్ దూబెను తీసుకున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ప్రకటించింది. ఢిల్లీ జట్టు వెల్లడించిన వివరాల ప్రకారం టోర్నమెంట్‌లోని మిగతా అన్ని మ్యాచ్‌లకు దూబే అందుబాటులో ఉండనున్నాడు. కర్ణాటకకు చెందిన ఈ యంగ్ క్రికెటర్ కర్ణాటక రంజీ జట్టు తరపున 14 టీ20 మ్యాచ్‌ల్లో పాల్గొని 16 వికెట్లు తీసుకుని 6.87 ఎకానమితో కొనసాగుతున్నాడు. అక్టోబర్ 3న షార్జా ఇంటర్నేషనల్ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో మ్యాచ్ సందర్భందా అమిత్ మిశ్రా బౌలింగ్ చేయి మధ్య వేలికి గాయమైంది. అప్పటి నుంచి ఈ సీజన్‌లో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లకు దూరమైన మిశ్రాకు ఆ తర్వాత సర్జరీ కూడా జరిగింది.

మ్యాచ్ లో గాయ పడ్డ అమిత్ మిశ్రా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ప్రకటించింది. గాయం కారణంగా ఐపిఎల్ నుంచి ఔట్ అయిన అమిత్ మిశ్రా.. అంతకంటే ముందుగా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు తీశాడు. ఐపిఎల్ 2020 నుంచి నిష్క్రమించేనాటికి ఐపిఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన లసిత్ మలింగ తర్వాత ఆ రికార్డు సొంతం చేసుకున్న ఆటగాడిగా అమిత్ మిశ్రా రికార్డు సొంతం చేసుకున్నాడు. ఢిల్లీ ప్రాంచైజీకి చెందిన ఆటగాళ్లను ఎన్ని గాయాలు వేధిస్తున్నా.. ఐపిఎల్ 2020 పాయింట్స్ పట్టికలో మాత్రం ఆ జట్టు టాప్‌ ర్యాంక్‌లోనే కొనసాగుతుండటం విశేషం. ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్ అందులో ఏడు మ్యాచ్‌ల్లో విజయం సాధించి 14 పాయింట్స్‌తో ముందంజలో కొనసాగుతోంది. ఆ తర్వాత రెండో స్థానంలో ముంబై ఇండియన్స్, మూడో స్థానంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, నాలుగో స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు ఉన్నాయి. చెన్నై జట్టు చివరి స్థానంలో వుంది.

Tags :

Advertisement