Advertisement

  • ప్రణబ్ ముఖర్జి పాఠశాలకు వెళ్లడం కోసం రోజూ 10 కిమీ నడిచేవారట

ప్రణబ్ ముఖర్జి పాఠశాలకు వెళ్లడం కోసం రోజూ 10 కిమీ నడిచేవారట

By: chandrasekar Tue, 01 Sept 2020 09:24 AM

ప్రణబ్ ముఖర్జి పాఠశాలకు వెళ్లడం కోసం రోజూ 10 కిమీ నడిచేవారట


నిజ జీవితంలో మరియు రాజకీయాల్లోనూ అజాతశత్రుగా కీర్తిగఢించి ప్రణబ్‌ కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవచేశారు. సుదీర్ఘకాలం పాటు ప్రజా సేవలో ఉన్నా ఎన్నో విజయాలు అందుకున్నా ఏ మాత్రం గర్వం లేని నాయకుడు ప్రణబ్ ముఖర్జి. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇక లేరనే చేదు నిజాన్ని యావత్ భారతావని జీర్ణించుకోలేకపోతోంది. వివాదాలకు దూరంగా అజాతశత్రువుగా అందరి మనసు దోచుకున్న నాయకుడు ఆయన. తన జీవితాన్ని అంతా ప్రజాసేవకే ధారపోసిన ఆ రాజకీయ దిగ్గజం అంటే ఎవరికైనా ఇష్టమే. అందుకే ఆయన మరణం పార్టీలకు అతీతంగా అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఐతే ఆయన ఈ స్థాయికి చేరడం వెనుక కఠోర శ్రమ దాగి ఉంది.

పశ్చిమబెంగాల్ బీర్భూమ్‌ జిల్లాలోని మిరాటి అనే ఓ మారుమూల పల్లెటూరిలో 1935 డిసెంబర్ 11న జన్మించిన ప్రణబ్ ముఖర్జి బాల్యంలో చదువుకునే రోజుల్లో పాఠశాలకు వెళ్లడం కోసం రోజూ 10 కిమీ నడిచేవారట. ఈ విషయాన్ని ఓసారి పార్లమెంట్‌లో మాట్లాడుతూ ఆయనే స్వయంగా వెల్లడించారు. 2010 ఆగస్టులో పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ధరల పెరుగుదలని వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా అంతకు కొద్ది రోజుల క్రితమే అప్పటి యూపిఏ ప్రభుత్వం కిరోసిన్, ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు పెంచింది. ఇదే విషయమై ప్రతిపక్షాలు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఆందోళనకు దిగాయి.

పార్లమెంటులో ప్రతిపక్షాల ఆందోళనకు జవాబు చెప్పే క్రమంలో అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ప్రణబ్ ముఖర్జి మాట్లాడుతూ తాను కూడా పల్లెటూరి వాడినేనని తాను చిన్నప్పటి రోజుల్లో ఎలాంటి రవాణా సదుపాయాలు ఉండేవి కావని అన్నారు. చిన్న తనంలో చదువు కోసం బడికి వెళ్లాలంటే రోజూ 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లాల్సి వచ్చేదని అన్నారు. కిరోసిన్ దీపం వెలుతురులో చదువుకున్నానని పేదల కష్టాలు తనకు తెలియనివి కావు అని గుర్తుచేసుకున్నారు. బీర్భూమ్‌ జిల్లాలోని సూరి విద్యాసాగర్ కళాశాలలో, కోల్‌కతా యూనివర్సిటీలో ప్రణబ్ ముఖర్జీ తన ఉన్నత విద్యను అభ్యసించారు. ఇందిరా గాంధీ తో కలసి రాజకీయాల్లో చురుక పాల్గొనేవారు.

Tags :
|

Advertisement