Advertisement

  • మరొకసారి తన సేవాగుణాన్ని చాటుకున్న ప్రకాష్ రాజ్

మరొకసారి తన సేవాగుణాన్ని చాటుకున్న ప్రకాష్ రాజ్

By: Sankar Sun, 04 Oct 2020 8:15 PM

మరొకసారి తన సేవాగుణాన్ని చాటుకున్న ప్రకాష్ రాజ్


టాలీవుడ్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పోషించని పాత్రలేదంటే అతిశయోక్తికాదేమో .. ఏ పాత్రలోకైనా ఇటే ఒదిగిపోయే ప్రకాష్ రాజ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. సేవ కార్యక్రమాల్లోనూ ప్రకాష్ రాజ్ ముందుంటారు. ఇప్పటికే ఒక ఉరిని దత్తత తీసుకొని ఆయన అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా మరోసారి ఆయన తన మంచి మనసును చాటుకున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన పెద్దేవంకు చెందిన సిరిచందన అనే విద్యార్థికి ప్రకాష్ రాజ్ అండగా నిలిచారు. కంప్యూటర్ సైన్స్ పూర్తి చేసిన ఆమె ఇంగ్లాండ్ లోని మాంచెస్టర్ యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ సీటును సంపాదించింది.

తండ్రి లేని కారణంగా ఆమె అక్కడకు వెళ్లి మాస్టర్స్ చేయలేకపోతున్నట్లుగా తెలుసుకున్న ప్రకాష్ రాజ్ ఆమెను స్వయంగా కలిసి సాయం చేసేందుకు తాను సిద్దంగా ఉన్నాను అని నీవు వెళ్లి మాస్టర్స్ చదువుకో అంటూ హామీ ఇచ్చాడు..తండ్రి లేకపోవడంతో పాటు ఆర్థికపరమైన ఇబ్బందుల కారణంగా ఉన్నత చదువులు చదవలేక పోతున్నట్లుగా ఆమె సోషల్ మీడియాలో తెలియజేసింది. అది చూసిన ప్రకాష్ రాజ్ ఆమెకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు.

Tags :
|
|

Advertisement