Advertisement

  • షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోను సూద్ కు సన్మానం చేసిన ప్రకాష్ రాజ్

షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోను సూద్ కు సన్మానం చేసిన ప్రకాష్ రాజ్

By: Sankar Mon, 28 Sept 2020 6:35 PM

షూటింగ్ లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన సోను సూద్ కు సన్మానం చేసిన ప్రకాష్ రాజ్


కరోనా సమయంలో వలసకార్మికులకు కొండంత అండగా నిలబడి వారిని ఆదుకున్నారు. లాక్ డౌన్ మొదలైన నాటినుండి ఆయన ఇతర ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులను సొంత గ్రామాలకు తరలించడానికి ప్రత్యేక బస్సులు, రైళ్లను ఏర్పాటు చేసాడు.

ఇక ఇప్పుడు ఏకంగా కేరళలో చిక్కుకున్న ఒడిస్సా అమ్మాయిలను సొంత గ్రామాలకు చేర్చడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసాడు.విదేశాల్లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను స్వదేశానికి రప్పించారు. అంతే కాకుండా కష్టాలు చెప్పుకున్న ప్రతి ఒక్కరికి లేదనకుండా సాయం చేసాడు . రీల్ లో చేసేది విలన్ పాత్రలే అయినా రియల్ లైఫ్ లో మాత్రం సూపర్ హీరో అనిపించుకున్నాడు. దేశమంతా సోనూసూద్ ను ప్రశంశలతో ముంచేస్తుంది. తాజాగా సోనూసూద్ ను నటుడు ప్రకాష్ రాజ్ సన్మానించారు. రియల్‌ హీరోగా నిలిచిన సోనూ సూద్‌కు హైదరాబాద్‌లో ఘన స్వాగతం లభించింది.

అల్లుడు అదుర్స్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు వచ్చిన సోనూ.. సెట్‌లోకి వస్తుండగానే చప్పట్లతో ఆహ్వానించారు. అనంతరం సోనూను శాలువాతో సన్మానించారు ప్రకాశ్‌ రాజ్. సోనూ చేస్తున్న మంచి పనులకు ప్రకాష్ రాజ్, బ్రహ్మాజీతో మిగతా నటీనటులు.. సోనూ సూద్‌ రియల్‌ హీరో అంటూ ప్రశంసించారు. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

Tags :

Advertisement