Advertisement

సచిన్ వికెట్ పడగొట్టు ....వాచ్ గిఫ్ట్ పట్టు ...

By: Sankar Sun, 28 June 2020 5:48 PM

సచిన్ వికెట్ పడగొట్టు ....వాచ్ గిఫ్ట్ పట్టు ...

సచిన్ టెండూల్కర్ ..క్రికెట్ దేవుడిగా ప్రపంచ వ్యాప్తంగా మన్నలను అందుకున్న ఆటగాడు ..సచిన్ వికెట్ తీస్తే జన్మ ధన్యం అయింది అని భావించే బౌలర్లు ఎంతో మంది ఉన్నారు ..అయితే ఆలా ఒక మ్యాచ్ల్లో సచిన్ వికెట్ తీసినందుకు యాజమాన్యం నుంచి వాచ్ గిఫ్ట్ గా అందుకున్నాడు టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ..ఆ విశేషాలను ఓజా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు ..

భారత్‌లో సాధారణ ఎన్నికల కారణంగా 2009 ఐపీఎల్ సీజన్‌ దక్షిణాఫ్రికా వేదికగా జరగగా.. డర్బన్ వేదికగా ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో తాను సచిన్ వికెట్ పడగొట్టడాన్ని ఓజా తాజాగా గుర్తు చేసుకున్నాడు. ‘‘ముంబయితో మ్యాచ్‌కి ముందు రోజు నేను నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా.. దక్కన్ ఛార్జర్స్ ఓనర్ అక్కడికి వచ్చి నాతో ఓ మాట అన్నాడు.

‘ప్రగ్యాన్.. నువ్వు రేపు మ్యాచ్‌లో సచిన్ వికెట్ పడగొడితే..? నీకు స్పెషల్ గిప్ట్ ఇస్తా’ అని చెప్పాడు. దానికి బదులుగా నేను కూడా ‘సార్.. ఒకవేళ నేను సచిన్ వికెట్ పడగొడితే.. నాకు వాచ్ కావాలి’ అని కోరాను. మొత్తానికి తర్వాత రోజు మ్యాచ్‌లో నేను సచిన్ వికెట్ పడగొట్టడం.. నాకు వాచ్ గిప్ట్‌గా రావడం జరిగిపోయాయి’’ అని ఓజా వెల్లడించాడు.

Tags :
|
|
|
|

Advertisement