Advertisement

  • విదేశాల్లో ఇచ్చినట్లు మన దగ్గర పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇవ్వరు ..జనసేనాని పవన్ కళ్యాణ్

విదేశాల్లో ఇచ్చినట్లు మన దగ్గర పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇవ్వరు ..జనసేనాని పవన్ కళ్యాణ్

By: Sankar Fri, 23 Oct 2020 5:24 PM

విదేశాల్లో ఇచ్చినట్లు మన దగ్గర పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇవ్వరు ..జనసేనాని పవన్ కళ్యాణ్


వరద సాయంలో పారిశ్రామిక వేత్తల తీరు పై పవన్ కళ్యాణ్ కీలక కామెంట్స్ చేశారు. విదేశాల్లో పారిశ్రామికవేత్తలు తమ ఆస్తులను... తమ సంపదకు కారణమైన ప్రజలకి, సమాజానికి ఉదారంగా ఇస్తున్నారని, కానీ మన దగ్గర ఉన్న పారిశ్రామికవేత్తల్లో అంత ఉదారత కనిపించదు. కారణం ఏమిటి? అని అయన ప్రశ్నించారు.

అయితే ఇంజనీరింగ్, ఇతర డిగ్రీలు చదివి పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకొనేవారికి అమెరికా వంటి దేశాల్లో వ్యవస్థలు బాగా సపోర్టు చేస్తాయనిమ్ అందుకే వాళ్లు వ్యవస్థకు ఏదైనా చేద్దామని ముందుకు వస్తారని అన్నారు. ఇక్కడ కూడా చాలా మంది పారిశ్రామికవేత్తలు వ్యవస్థలకు చాలా చేస్తున్నారని అయితే విదేశాల్లో ఉన్నంత ఉదారత ఇక్కడ ఎందుకు కనిపించదో లోతుగా విశ్లేషణ జరగాలని అన్నారు.

అక్కడి వారితో పోల్చితే ఇక్కడ పారిశ్రామికవేత్తలది తప్పని నేను మాట్లాడనన్న ఆయన ఎందుకంటే వారికున్న సాదకబాధకాలపై వారితో మాట్లాడితే మరింత స్పష్టత వస్తుందని అన్నారు.ఇక సినిమా వాళ్ళ విరాళాల మీద పవన్ కళ్యాణ్ స్పందించిన విషయం తెలిసిందే ..సినిమా వాళ్లకు పేరు ఎక్కు వ డబ్బు తక్కువ ఉంటుంది ..బయట జనాలు అనుకున్నంత డబ్బు సినిమా వాళ్ళ డాగర ఉండదు అని అన్నారు జనసేనాని..

Tags :

Advertisement