Advertisement

  • పవర్ స్టార్ వకీల్ సాబ్ తర్వాత మూవీ ఆ రీమేక్ యేన !

పవర్ స్టార్ వకీల్ సాబ్ తర్వాత మూవీ ఆ రీమేక్ యేన !

By: Sankar Sun, 20 Dec 2020 4:49 PM

పవర్ స్టార్ వకీల్ సాబ్ తర్వాత మూవీ ఆ రీమేక్ యేన !


సినిమాలకు కొంతకాలం బ్రేక్ ఇచ్చి రీఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు ..దీనితో పవన్ ఫాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు...అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే..

దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వేసవి కానుకగా విడుదల కావాల్సి ఉంది. దిల్‌రాజు-బోనీకపూర్‌ సంయుక్త నిర్మిస్తోన్న ఈమూవీలో ప్రకాశ్‌రాజ్‌ మరో లాయర్‌గా కనిపించనున్నాడు. శృతిహాసన్‌ కీలకపాత్రలో నటిస్తోంది.ఇక ‘వకీల్‌సాబ్‌’ తర్వాత పవన్ ‘అయ్య‌ప్ప‌నుమ్ కోశియుమ్‌’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ల‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ సినిమాని ఈ నెల 21న ప్రారంభించనున్నారని సినీవర్గాల సమాచారం. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు అందిస్తాడని వినిపిస్తోంది. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. కాగా దర్శకులు క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాల్లో ప‌వ‌న్ న‌టించాల్సి ఉంది.

Tags :

Advertisement