Advertisement

  • మలయాళ రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభించిన పవర్ స్టార్ ..

మలయాళ రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభించిన పవర్ స్టార్ ..

By: Sankar Mon, 21 Dec 2020 12:27 PM

మలయాళ రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభించిన పవర్ స్టార్ ..


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు..అజ్ఞాతవాసి సినిమా తర్వాత కొంచెం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవర్ స్టార్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ అభిమానులకు ఫుల్ ఖుషి ఇస్తున్నాడు..ఇప్పటికే వకీల్ సాబ్ సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్న పవర్ స్టార్ ఇప్పుడు మరొక కొత్త సినిమాను స్టార్ట్ చేసాడు...

మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ తెలుగు రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ ప్రారంభించింది. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, పవన్ కళ్యాణ్ క్లాప్ కొట్టారు. ఈ చిత్రాన్ని సాగర్ కె చంద్ర డైరెక్ట్ చేయనున్నారు.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభమవుతుందని చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాలో పవన్‌తోపాటు దగ్గుబాటి హీరో రానా కూడా నటిస్తున్నాడు. దానికి సంబంధించిన అప్‌డేట్‌ను చిత్రబృందం ఇంతకముందే విడుదల చేసింది.

Tags :
|

Advertisement