Advertisement

  • నిహారిక చైతన్యల పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవర్ స్టార్

నిహారిక చైతన్యల పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవర్ స్టార్

By: chandrasekar Wed, 09 Dec 2020 11:29 AM

నిహారిక చైతన్యల పెళ్లి వేడుకల్లో పాల్గొన్న పవర్ స్టార్


ఈ రోజు ఉదయపూర్ లో జరిగే నిహారిక మరియు చైతన్య ల పెళ్లి వేడుకల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. సినిమా షూటింగ్ తో పాటు హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్ల ఈరోజు ఉదయం ఉదయపూర్ చేరుకున్నారు. నాగబాబు తమ్ముడు పవన్ కళ్యాణ్ పెళ్లి వేడుకల్లో పాల్గొనడం వల్ల ఆయన సంతోషాన్ని వెలిబుచ్చారు.

మెగాస్టార్ ఫ్యామిలీ అందరూ కలిసి గ్రూప్ ఫోటోలో దిగి సోషల్ మీడియాలో షేర్ చేయడం వల్ల అభిమానుల నుండి ఎక్కువ లైక్ లు పొందుతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పెళ్లి వేడుకలో పవన్ కళ్యాణ్ తో పాటు అతని తనయుడు అకీరా కూడా పాల్గొన్నాడు.

ఈరోజు అనగా డిసెంబర్ 9న రాత్రి ఏడు గంటల 15 నిమిషాలకు నాగబాబు కూతురు నిహారికకు గుంటూరు ఐజి ప్రభాకర్ రావు కుమారుడు చైతన్యకు వివాహం ఉదయపూర్ లో జరగనుంది. ఈ వివాహానికి ఉదయపూర్ లో వుండే ఉదయవిలాస్ వివాహానికి వేదిక కానుంది. ఇక్కడ ఈ వివాహం ఘనంగా నిర్వహించనున్నారు.

Tags :

Advertisement