Advertisement

  • భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం..

భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం..

By: chandrasekar Tue, 13 Oct 2020 5:48 PM

భారీ వర్షాలతో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం..


హైదరాబాద్: రెండు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రమాదాలను నివారించడంతోపాటు అంతరాయాలను ఎప్పటికప్పుడు సరిచేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులపై ఎప్పటికప్పుడు స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో సూపెరింటెండింగ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు ఇప్పటి వరకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయలు లేవు అన్ని ఫీడర్లు సక్రమంగా పనిచేస్తున్నా ముందు జాగ్రత్తచర్యలతో సదా సిద్ధంగా ఉండేలా సిబ్బందిని అప్రమత్తం చేయాలని చీఫ్ జనరల్ సూచనలిచ్చారు. ముఖ్యంగా వర్షం నీరు నిల్వ ఉన్న చోట ఉన్న విద్యుత్ స్తంభాలు, తీగల వద్ద ఇన్సులేషన్ ను తనిఖీ చేసి విద్యుత్ లీకేజీ లేకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

అలాగే వర్షం నీరు నిల్వ వున్న చోట విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ ఫార్మర్లు, తీగల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. వాటి వద్దకు ఎవరూ వెళ్లకుండా.. తగిన జాగ్రత్తలు పాటించేలా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ఎక్కడైనా రోడ్లపైన గాని భవనాలపై తీగలు తెగిపడి ఉంటే.. వెంటనే విద్యుత్ సంస్థ కు ఫోన్ చేసి తెలియజేయాలని సీఎండీ జి రఘుమా రెడ్డి కోరారు.

అలాగే కరెంటు సరఫరాలో వోల్టేజ్ లో హెచ్చు తగ్గులు వున్నా, విద్యుత్ సరఫరా లో అంతరాయం కలిగినా స్థానిక ఫ్యూజ్ ఆఫ్ కాల్ ఆఫీసులు 1912 లేదా 100 నెంబర్లతోపాటు విద్యుత్ శాఖ ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 73820 72104, 73820 72106,73820 71574 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని తెలిపారు.

Tags :
|

Advertisement