Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడ్డ సచివాలయం పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడ్డ సచివాలయం పరీక్షలు

By: chandrasekar Mon, 20 July 2020 2:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో వాయిదా పడ్డ  సచివాలయం పరీక్షలు


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల్లో 15,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరిలో ఈ ఉద్యోగాల భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 19 నోటిఫికేషన్లు జారీ చేసింది. గతంలో ఈ ఉద్యోగాలను ఆగస్టులో భర్తీ చేయాలని ప్రభుత్వం భావించింది. ‘ఆగస్టు రెండో వారంలో జరగాల్సిన గ్రామ, వార్డు సచివాలయం పరీక్షలు వాయిదా పడ్డాయి. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామో త్వరలో తెలియజేస్తాం’ అని పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.

ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా పంచాయతీ సెక్రటరీలు, వీఆర్వోలు, ఏఎన్ఎంలు, మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్, విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్, విలేజ్ హార్టికల్చరల్ అసిస్టెంట్, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, విలేజ్ సెరీ కల్చర్ అసిస్టెంట్, మహిళా పోలీస్, మహిళా శిశు సంక్షేమ అసిస్టెంట్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 2), పంచాయత్ సెక్రటరీ (గ్రేడ్ 6), డిజిటల్ అసిస్టెంట్ , విలేజ్ సర్వేయర్ (గ్రేడ్ 3), వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనుంది ప్రభుత్వం. అంతకు ముందు రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

Advertisement