Advertisement

వాయిదా పడ్డ ప్రముఖ సింగర్ సునీత వివాహం

By: chandrasekar Wed, 16 Dec 2020 09:09 AM

వాయిదా పడ్డ ప్రముఖ సింగర్ సునీత వివాహం


ప్రముఖ సింగర్ సునీతకు మీడియా డైరెక్టర్ రామ్ కు గత కొన్ని రోజుల క్రితం నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. సింగర్ సునీతకు ఇది రెండో వివాహం. ఆమె మొదటి భర్తకు విడాకులివ్వడంతో ఇప్పుడు రామ్ ను రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈమె పెళ్లి పై పలువురు అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

సునీత నిశ్చితార్థం ఫోటో లు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి. సునీత తన 43 ఏట రెండో వివాహం చేసుకోబోతున్నారు. ఈమె తక్కువ వయసులోనే తన మొదటి పెళ్లి చేసుకున్నారు. ఆమె కిరణ్ కుమార్ ను మొదటి సారిగా వివాహమాడారు. ఈ దంపతులకి ఇద్దరు పిల్లలు వున్నారు. వీరి మొదటి వివాహం మనఃస్పర్ధల వల్ల విడిపోయినట్లు తెలిసింది.

ప్రస్తుతం సునీత ప్రముఖ మీడియా డైరెక్టర్ రామ్ ను రెండో సారి వివాహమాడనున్నారు. వీరి వివాహాన్ని ఈనెల డిసెంబర్ 27 వ తేదీన జరగాల్సివుంది. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఇప్పుడు ఈ పెళ్ళి వాయిదా పడినట్లు సమాచారం. వీరి వివాహం రానున్న నూతన సంవత్సరంలో జరగనున్నట్లు వినికిడి. దీనిపై కచ్చితమైన ప్రకటనలు ఏదీ వెలువడలేదు.

Tags :
|

Advertisement