Advertisement

  • అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి ట్రంప్ సంచలన ట్వీట్ ..

అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి ట్రంప్ సంచలన ట్వీట్ ..

By: Sankar Thu, 30 July 2020 9:33 PM

అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయాలి ట్రంప్ సంచలన ట్వీట్ ..



అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ట్వీట్‌ చేశారు. నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేయాలని ట్రంప్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కరోనా వైరస్‌ దృష్ట్యా దేశంలో ఎన్నికలు జరిగే పరిస్థితి లేదని, పోస్టల్‌ బ్యాలెట్‌తో ఎన్నికలు నిర్వహిస్తే అవకతవకలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

అంతేకాకుండా ఎన్నికల ఫలితాలు కూడా తారుమారు అయ్యే అవకాశం ఉందని ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతమున్న గడ్డు పరిస్థితి నుంచి బయటపడి, ప్రజలంతా క్షేమంగా బయటకు వచ్చి ఓటింగ్‌లో పాల్గొనే వరకు ఎన్నికలను వాయిదా వేయడం మంచిదన్నారు. కాగా నవంబర్‌ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్‌ చేసిన ట్వీట్‌ తీవ్ర దుమారం రేపుతోంది..

కాగా ప్రపంచమంతా ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరు చేస్తుంటే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం ఎన్నికలపై తీవ్ర చర్చ నడుస్తోంది. ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపించే అమెరికా అధ్యక్ష ఎన్నికలు అనుకున్న షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయా? లేదా అనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే ట్రంప్‌ చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.

మొదటితో పోలిస్తే వైరస్‌ వ్యాప్తి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ.. పూర్తిగా అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో మరో నాలుగు నెలల్లో జరుగనున్న అధ్యక్ష ఎన్నికలపై దేశంలో విసృతమైన చర్చ జరుగుతోంది. అసలు ఎన్నికలు జరుగుతాయా? లేక చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి వాయిదా పడతాయా అనేది ఆసక్తికరంగా మారింది.

Tags :
|

Advertisement