Advertisement

  • అమెరికాలో ఉడుతకు 'బుబోనిక్ ప్లేగు' ప‌రీక్ష‌లో పాజిటివ్

అమెరికాలో ఉడుతకు 'బుబోనిక్ ప్లేగు' ప‌రీక్ష‌లో పాజిటివ్

By: chandrasekar Thu, 16 July 2020 12:53 PM

అమెరికాలో ఉడుతకు 'బుబోనిక్ ప్లేగు' ప‌రీక్ష‌లో పాజిటివ్


ప్ర‌పంచం అంతా క‌రోనాతో పోరాడుతుంటే అమెరికాలో తాజాగా ఓ ఉడుత‌కు బుబోనిక్ ప్లేగు సోకింది. కొల‌రాడో రాష్ట్రానికి చెందిన ఆ ఉడుత బుబోనిక్ ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో హెల్త్ వార్నింగ్ జారీ చేశారు.

జూలై 11న మోరిస‌న్ ప‌ట్ట‌ణంలో జ‌రిగిన ప‌రీక్ష‌లో ఓ ఉడుత‌కు ప్లేగు సోకిన‌ట్లు నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. బుబోనిక్ ప్లేగు బ్యాక్టీరియా ద్వారా సోకే వ్యాధి. ఇది ఎలుక‌లు, ఉడుత‌ల లాంటి జీవాల మీద వాలే ఈగ‌ల‌తో వ్యాప్తి చెందుతుంది.

స‌రైన జాగ్ర‌త్త‌లు తీసుకోకుంటే, ఈ వ్యాధి మ‌నుషుల‌కు సోకే ప్ర‌మాదం ఉన్న‌ది. ఇటీవ‌ల చైనాలో ఇద్ద‌రు అన్నాద‌మ్ముళ్ల‌కు ఈ వ్యాధి సోకింది. జూలై 7వ తేదీన జ‌రిగిన ప‌రీక్ష‌లో వారు పాజిటివ్‌గా తేలారు.

ప్లేగు మ‌ళ్లీ పుట్టుకువ‌చ్చింద‌ని ఇటీవ‌ల ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ కూడా హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప్లేగు సోకిన వారిలో జ్వ‌రం, వ‌ణుకుడు, త‌ల‌నొప్పి లాంటి ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. వీలైనంత త్వ‌ర‌గా చికిత్స అందించాల్సి ఉంటుంది.

Tags :
|

Advertisement