Advertisement

  • ఆన్‌లైన్ క్లాసుల వాట్సప్ గ్రూప్‌లో నీలి చిత్రం

ఆన్‌లైన్ క్లాసుల వాట్సప్ గ్రూప్‌లో నీలి చిత్రం

By: Dimple Tue, 18 Aug 2020 00:01 AM

ఆన్‌లైన్ క్లాసుల వాట్సప్ గ్రూప్‌లో నీలి చిత్రం

కర్నూలు జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. ఆన్‌లైన్ క్లాసుల వాట్సప్ గ్రూప్‌లో నీలి చిత్రం వీడియో కలకలం రేగింది. ఈ ఘటన పత్తికొండ ప్రభుత్వ పాఠశాల వాట్సప్ గ్రూప్‌లో వెలుగు చూసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పాఠశాల విద్యార్థులకు అంతటా ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జిల్లాలోని పత్తికొండ ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ పాఠశాల విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌లో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు.

ఆన్‌లైన్ క్లాసెస్ కోసం ఏర్పాటు చేసిన విద్యార్థినుల గ్రూప్‌లో సెక్స్ వీడియో కలకలం రేపింది. జిల్లాలోని పత్తికొండ ప్రభుత్వ బాలికల హైస్కూల్ పాఠశాల విద్యార్థినులకు ఆన్‌లైన్ తరగతుల నిర్వహణ కోసం తరగతికి ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. అందులో ఎనిమిదో తరగతి విద్యార్థినుల గ్రూప్‌లో గుర్తు తెలియని వ్యక్తి సెక్స్ వీడియో పోస్ట్ చేశారు.

వీడియో గ్రూప్‌లో పోస్ట్ చేసి రెండురోజులైనా కనీసం డిలీట్ చేయలేదు. ఆ తరగతి ఉపాధ్యాయులు కూడా పట్టించుకోకపోవడంతో విషయం సీరియస్ అయింది. విద్యార్థినుల గ్రూప్‌లో సెక్స్ వీడియో వ్యవహారం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు నేరుగా ఎంఈవో ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ క్లాసెస్ గ్రూప్‌లో అసభ్యకర వీడియో పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags :
|

Advertisement