Advertisement

ఎస్వీబీసీలో పోర్న్ సైట్ కలకలం..

By: Sankar Wed, 11 Nov 2020 2:04 PM

ఎస్వీబీసీలో పోర్న్ సైట్ కలకలం..


తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఎస్వీబిసిలో పార్న్ సైట్ లింక్ కలకలం రేపింది. శతమానం భవతి కార్యక్రమానికి సంభిందించి ఎస్వీబిసికి ఒక భక్తుడు మెయిల్ చేశాడు.

అయితే తిరిగి భక్తుడికి పార్న్ సైట్ విడియో పంపాడు ఒక యస్వీబిసి ఉద్యోగి. దీంతో భక్తుడు టీటీడీ ఈవో సహా చైర్మన్ కు కూడా ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన పై తీవ్రంగా స్పందించిన ఈవో జవహర్ రెడ్డి టీటీడీ విజిలెన్స్ కి సమాచారం అందించారు. దీంతో ఎస్వీబిసి కార్యలయంలో టీటీడీ విజిలెన్స్, సైబర్ క్రైమ్ టీం, ఈడిపి అధికారులు తనిఖిలు నిర్వహించారు.

పార్న్ సైట్ విడియో పంపిన ఉద్యోగితో పాటు కార్యలయంలో పార్న్ సైట్లు చూస్తూన్న మరో 5 గురు ఉద్యోగులను గుర్తించింది సైబర్ క్రైమ్ టీం. కార్యలయంలో విధులు నిర్వహించకూండా ఇతర విడియోలు చూస్తూన్న మరో 25 మంది సిబ్బందిని గుర్తించింది సైబర్ క్రైమ్ టీం. దీంతో వీరందరి మీద చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతున్నారు ఎస్వీబీసీ ఎండీ.

Tags :
|
|
|

Advertisement