Advertisement

  • ప్రముఖ తెలుగు పాప్ సింగర్‌ స్మితకు కరోనా పాజిటివ్

ప్రముఖ తెలుగు పాప్ సింగర్‌ స్మితకు కరోనా పాజిటివ్

By: chandrasekar Wed, 05 Aug 2020 11:02 AM

ప్రముఖ తెలుగు పాప్ సింగర్‌ స్మితకు కరోనా పాజిటివ్


ప్రముఖ తెలుగు పాప్ సింగర్‌ స్మితకు కరోనా సోకింది. తాజాగా ఆమెకు జరిపిన టెస్టుల్లో కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపారు. నిన్న వ్యాయామం చేస్తున్న సమయంలో కాస్త అలసటగా అనిపించి, ఎందుకైనా మంచిదని టెస్ట్ చేయించుకున్నానమన్నారు. అయితే ఈ టెస్టుల్లో తనత పాటు భర్త శశాంక్‌కు కూడా పాజిటివ్ అని తేలిందన్నారు. కుటుంబంలో మిగిలిన కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. త్వరలోనే కరోనా నుండి బయటపడి ప్లాస్మా దానం కూడా చేస్తానని స్మిత తెలిపారు.

స్మిత పలు తెలుగు సినిమాల్లో కూడా నటించారు. ఇక ఆమె పాటల విషయానికి వస్తే హాయ్ రబ్బా అంటూ వచ్చిన ఆమె అల్బామ్ అందర్నీ ఎంతగానో అలరించింది. ఆ తర్వాత బాహుబలి సినిమాతో ఫేమస్ అయిన కిలికిలి భాషలో కూడా ఆమె ఓ పాట పాడింది. కొన్ని రిమిక్స్‌తో సాంగ్స్‌తో కూడా అలరించింది. కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్‌లో కూడా చేసింది స్మిత.

Tags :
|
|

Advertisement