Advertisement

  • ఫ్రీ కరోనా వ్యాక్సిన్ ప్రకటన చేసిన పుదుచ్చేరి

ఫ్రీ కరోనా వ్యాక్సిన్ ప్రకటన చేసిన పుదుచ్చేరి

By: Sankar Sun, 25 Oct 2020 08:46 AM

ఫ్రీ కరోనా వ్యాక్సిన్ ప్రకటన చేసిన పుదుచ్చేరి


దేశంలో ఇప్పుడు ఎక్కడ చుసిన కరోనా ఫ్రీ వాక్సిన్ గురించే చర్చ జరుగుతుంది..ఎప్పుడైతే బీహార్ ఎన్నికల మానిఫెస్టోలో ఫ్రీ కరోనా వ్యాక్సిన్ అని ప్రకటించిందో అప్పటినుంచి ఈ చర్చ మొదలయింది ..ప్రస్తుతానికి దేశంలో కరోనా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నప్పటికీ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరికి ఫ్రీ గా ఇస్తారా లేదా అనేది పెద్ద ప్రశ్నగా మారింది..

రాష్ట్రాలు కూడా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత రాష్ట్రాల్లో ఫ్రీగా ప్రజలు అందిస్తామని ప్రకటిస్తున్నాయి. బీహార్ లో బీజేపీ మ్యానిఫెస్టోలో ఈ విషయాన్ని ప్రకటించిన కొన్ని గంటల్లోనే తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ట్రప్రభుత్వాలు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రజలు ఫ్రీగా వ్యాక్సిన్ ను అందిస్తామని ప్రకటించాయి. కాగా, ఈరోజు మరో రాష్ట్రం కూడా ఆ బాటలోనే పయనించింది. దేశంలోని కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ఈ విధమైన ప్రకటన చేసింది.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రజలు ఫ్రీగా అందిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారాయణసామి తెలియజేశారు. కేంద్రం వ్యాక్సిన్ కొనుగోలుకు నిధులు ఇస్తుందో లేదో తెలియదుగాని, వ్యాక్సిన్ వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ను కొనుగోలు చేస్తామని ప్రకటించింది. ఈ బాటలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా ప్రకటించే అవకాశం ఉన్నది.

Tags :
|

Advertisement