Advertisement

  • ఐపీఎల్ ఎల్‌వన్ కెప్టెన్‌గా పొలార్డ్...ధోనీ, రోహిత్, కోహ్లీలకు స్థానం కల్పించలేదు

ఐపీఎల్ ఎల్‌వన్ కెప్టెన్‌గా పొలార్డ్...ధోనీ, రోహిత్, కోహ్లీలకు స్థానం కల్పించలేదు

By: chandrasekar Fri, 16 Oct 2020 11:03 AM

ఐపీఎల్ ఎల్‌వన్ కెప్టెన్‌గా పొలార్డ్...ధోనీ, రోహిత్, కోహ్లీలకు స్థానం కల్పించలేదు


తన ఫేవరేట్ ఐపీఎల్ ఎల్‌వన్ జట్టును ఎంచుకున్నారు వెస్టిండీస్ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత‌ ఇయాన్ బిషప్‌. తన వర్చ్‌వల్ టీంలో ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు స్థానం కల్పించలేదు. అందర్ని ఆశ్చర్యపరిచేలా ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్‌ కీరోన్‌ పొలార్డ్‌ను‌ బిషప్‌ తన ఐపీఎల్‌ జట్టుకు కెప్టెన్‌గా ఎంపిక చేశాడు. ఇక పోలార్డ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. చివరిలో వచ్చి బ్యాట్‌తో మెరుపులు మెరిపిస్తున్నాడు. ఐపీఎల్ ముందు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ లో పొలార్డ్ సత్తాచాటాడు. ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను జట్టును విజేతగా నిలిపాడు.

7 ఏడుగురు భారత క్రికెటర్లకు తన ఎల్‌వన్ టీంలో చోటుకల్పించాడు బిషప్. వారిలో కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ శ్రేయస్‌ హార్దిక్‌ పాండ్యా మహ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, యజ్వేంద్ర చహల్‌ ఉన్నారు. ఓపెనింగ్ జోడిగా కేఎల్‌ రాహుల్‌, ఫాఫ్ డుప్లెసిస్‌ ఎంచుకోగా ఫస్ట్‌ డౌన్‌ ఆటగాడిగా సూర్యకుమార్‌ యాదవ్‌ బరిలోకి దింపాడు. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్‌ అయ్యర్‌‌ను మిడిలార్డర్‌గా ఎంచుకున్నాడు. హార్దిక్‌ పాండ్యా, రషీద్‌ ఖాన్‌లను ఆల్‌రౌండర్ల కోటాలో తీసుకున్నాడు.ప్రస్తుతం ముంబై జట్టులో హర్థిక్ పాండ్యా బ్యాట్ తో మెరుస్తున్నాడు. ఇక రషీద్ ఖాన్ కూడా తన బౌలింగ్ మయాజాలంతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. ఇయాన్ బిషప్ 80, 90 దశకంలో వెస్డిండీస్ జట్టు తరపున ఆడారు. చాలా మంది ప్రముఖ క్రికెటర్స్‌కు బౌలింగ్ వేసి వికెట్లు తీశాడు. వీండిస్ జట్టు తరపున 1988 నుంచి 1998 వరకు ఆడిన ఇయాన్ బిషప్ ఇండియన్ క్రికెటర్ సచిన్‌తో 9 మ్యాచులు ఆడాడు. వాటిలో నాలుగు టెస్టులు కాగా ఐదు వన్డే మ్యాచ్‌లున్నాయి. ఆ మ్యాచ్‌ల్లో కేవలం మూడు సార్లు మాత్రమే సచిన్‌ను ఔట్ చేశాడు. ఇయాన్ బిషప్‌ ప్రస్తుతం ఐపీఎల్ 2020‌లో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

Tags :
|
|

Advertisement