Advertisement

  • సుశాంత్ ని ఉద్దేశించి రాజకీయవేత్త సంజయ్‌ నిరూపమ్‌ ట్వీట్

సుశాంత్ ని ఉద్దేశించి రాజకీయవేత్త సంజయ్‌ నిరూపమ్‌ ట్వీట్

By: chandrasekar Wed, 17 June 2020 2:03 PM

సుశాంత్ ని ఉద్దేశించి రాజకీయవేత్త సంజయ్‌ నిరూపమ్‌ ట్వీట్


బాలీవుడ్‌ యువనటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆకస్మిక మరణంపై రకరకాల ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే సుశాంత్‌ సైన్‌ చేసిన సినిమాల విషయంలో చాలా అవకతవకలు జరిగాయని తాజాగా రాజకీయవేత్త సంజయ్‌ నిరూపమ్‌ ట్వీట్‌లో వెల్లడించారు.

సుశాంత్‌సింగ్‌ 2019లో వచ్చిన చిచ్చోరే సూపర్‌హిట్‌ అయిన తర్వాత 7 సినిమాలకు సంతకం చేశాడు.కేవలం 6 నెలల కాలంలో సుశాంత్‌ సంతకం చేసిన సినిమాలను కోల్పోయాడని సంజయ్‌ నిరూపమ్‌ హిందీలో రాసిన ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే 7 సినిమాల వివరాలు మాత్రం తెలియజేయలేదు.

సినీ పరిశ్రమలో క్రూరత్వం పెరిగి పోతుంది. ఆ క్రూరత్వం మంచి టాలెంట్‌ ఉన్న నటుడిని చంపేసిందని సంచలన ట్వీట్‌ చేశారు. సినీ పరిశ్రమలో బంధుప్రీతి వల్లే ఆత్మహత్యలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో సంజయ్‌ నిరూపమ్‌ చేసిన ట్వీట్లు చర్చకు దారితీస్తున్నాయి.

Tags :
|

Advertisement