Advertisement

  • తెలంగాణలో కరోనా పరీక్షలపై ఇప్పటికే రాజకీయ దుమారం

తెలంగాణలో కరోనా పరీక్షలపై ఇప్పటికే రాజకీయ దుమారం

By: chandrasekar Thu, 28 May 2020 3:47 PM

తెలంగాణలో కరోనా పరీక్షలపై ఇప్పటికే రాజకీయ దుమారం


తెలంగాణలో కరోనా పరీక్షలపై ఇప్పటికే రాజకీయ దుమారం రేగుతోంది. కరోనా పరీక్షలు చేయకుండా.. ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న కరోనా పరీక్షలపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణలో కరోనా పరీక్షలపై దాఖలపై పిటిషన్లపై హైకోర్టు విచారించింది.

మృతదేహాలకు కరోనా పరీక్షలు అవసరం లేదన్న ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేసింది. లక్షణాలు లేని హైరిస్క్ ఉన్న వారికి ఎందుకు పరీక్షలు చేయడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మిగతా రాష్ట్రాలతో పోల్చితే ఎందుకు తక్కువ పరీక్షలు చేస్తున్నారని నిలదీసింది.

political,scandal,telangana,corona,tests ,తెలంగాణలో, కరోనా, పరీక్షలపై, ఇప్పటికే, రాజకీయ దుమారం


రాష్ట్రంలో మార్చి 11 నుంచి ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల వివరాలను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది హైకోర్టు. అంతేకాదు పీపీఈ కిట్లను ఎంత మంది వైద్య సిబ్బందికి ఇచ్చారో చెప్పాలని సూచించింది. కరోనా పరీక్షలపై కేంద్ర ప్రభుత్వం రాసిన రెండు లేఖలను కూడా అందజేయాలని స్పష్టం చేసింది.

జూన్ 4 లోగా పూర్తి నివేదిక అందజేయాలని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1920 కరోనా యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ ఇప్పటి వరకు 1,164 మంది కోలుకోగా.. 56 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 700 యాక్టివ్ కరోనా కేసులున్నాయి.

Tags :
|

Advertisement