Advertisement

  • కరోనా కారణంగా ఓటింగ్ శాతం తగ్గింది ..ఎలక్షన్ కమిషనర్ పార్ధసారథి

కరోనా కారణంగా ఓటింగ్ శాతం తగ్గింది ..ఎలక్షన్ కమిషనర్ పార్ధసారథి

By: Sankar Tue, 01 Dec 2020 4:26 PM

కరోనా కారణంగా ఓటింగ్ శాతం తగ్గింది ..ఎలక్షన్ కమిషనర్ పార్ధసారథి


నేడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి ...ప్రతిసారి గ్రేటర్ ఎన్నికలలో ఓటింగ్ శాతం తక్కువ నమోదు అవుతుండటంతో ఈ సారి సినిమా వాళ్ళతో కూడా వోటింగ్ గురించి ప్రచారం చేయించారు అయినా కూడా ఈ సారి వోటింగ్ శాతం ఇంకా తక్కువగ నమోదు అయితుంది..దీనిపై ఎలక్షన్ కమిషనర్ స్పందించారు...

హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణంలో ఎలక్షన్ కొనసాగుతుంది అని ఎలక్షన్ కమిషనర్ పార్థసారథి తెలిపారు. ప్రింటింగ్ ప్రెస్ లో సింబల్ ప్రింట్ తప్పు పడింది. ఉదయం మెటీరియల్ ఇప్పి చూసే వరకు సింబల్ ప్రింట్ తప్పు పడిందనేది తెలియదు అని పేర్కొన్నారు. కోవిడ్ వల్ల కొంత ఓటింగ్ తగ్గింది , మధ్యాహ్నం తర్వాత ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది అన్నారు.

గతంలో కోవిడ్ లేదు కాబట్టి మధ్యాహ్నం 12 లోపు ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు.. కానీ ఇప్పుడు ఒక వైపు చలి, మరో వైపు కోవిడ్ తోటి పోలింగ్ తగ్గింది. ఇక శాంతి భద్రతలు పై వాస్తవాని కంటే రూమర్స్ ఎక్కువ ఉన్నాయి. పోలీసులు అందరూ అలర్ట్ గా ఉన్నారు , చిన్న చిన్న గొడవలు మినహా పెద్దగా ఏమి జరగలేదు అని పార్థసారథి తెలిపారు.

Tags :
|
|
|

Advertisement