Advertisement

  • ఫేస్ బుక్ కపుల్ ఛాలెంజ్ లో ఫొటోస్ ఫోర్న్ సైట్స్ లో వాడే అవకాశం...పోలీసుల హెచ్చరిక

ఫేస్ బుక్ కపుల్ ఛాలెంజ్ లో ఫొటోస్ ఫోర్న్ సైట్స్ లో వాడే అవకాశం...పోలీసుల హెచ్చరిక

By: chandrasekar Tue, 29 Sept 2020 1:48 PM

ఫేస్ బుక్  కపుల్ ఛాలెంజ్ లో ఫొటోస్  ఫోర్న్ సైట్స్ లో వాడే అవకాశం...పోలీసుల హెచ్చరిక


ఫేస్ బుక్ లో ప్రస్తుతం కపుల్ ఛాలెంజ్ లో భాగం అవ్వడానికి చాలా మంది తమ సన్నిహితులు, జీవిత భాగస్వాములతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తున్నారు. దానికి #CoupleChallenge అనే హ్యాష్ ట్యాగ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ హ్యాష్ ట్యాగ్ బాగా పాపులర్ అవుతోంది. మన దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఈ ఛాలెంజ్ లో భాగం అవుతున్నారు. అయితే ఈ హ్యాష్ ట్యాగ్ వల్ల గుర్తు తెలియని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇటీవలే పుణే పోలీసులు సాధరణ ప్రజలకు కపుల్ ఛాలెంజ్ విషయంలో హెచ్చరికలు జారీ చేశారు. కపుల్ ఛాలెంజ్ లో మీరు పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ ఛాలెంజ్ మీకు ప్రమాదం అయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

సైబర్ ఎక్స్ పర్ట్స్ ప్రకారం కపుల్ ఛాలెంజ్ హ్యాష్ ట్యాగ్ వాడుతూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ వాడి మంది ఫోటోలను ఎవరైనా చూసే అవకాశం ఉంది. ఈ ఫోటోలను సైబర్ క్రిమినల్స్ తమకు నచ్చిన విధంగా వాడుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సైబర్ ఎక్స్ ఫర్ట్స్ ప్రకారం ఈ చిత్రాలను డౌన్ లోడ్ చేసి పార్న్ సైట్స్ లో వాడటం లేదా సైబర్ క్రైమ్ కోసం వినియోగించే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి ఛాలెంజ్ నుంచి దూరంగా ఉండటం మంచిది అని అంటున్నారు నిపుణులు. ఒక వేళ మీరు ఈ ఛాలెంజ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే మాత్రం సెట్టింగ్స్ లో ఆడియెన్స్ అనే అప్షన్ ను లోకి వెల్లి ఫ్రెండ్స్ అనే అప్షన్ ఎంచుకోండి. అయినా కూడా ఈ ఛాలెంజ్ ప్రమాదకరమే అంటున్నారు.

Tags :

Advertisement