Advertisement

Breaking News: నల్గొండ లో సీఐ వాహనం చోరీ...!

By: Anji Fri, 13 Nov 2020 11:35 AM

Breaking News: నల్గొండ లో సీఐ వాహనం చోరీ...!

నల్లగొండ జిల్లాలో ఓ వ్యక్తి సీఐ వాహనాన్ని ఎత్తుకెళ్లి పోలీసులనే ఉరుకులు పరుగులు పెట్టించాడు. మిర్యాలగూడ పట్టణం ఈదులగూడా వద్ద సీఐ రమేష్ బాబుకు చెందిన పోలీసు వాహనాన్ని దుండగుడు చోరి చేశాడు.

ఈదులగూడా వద్ద అర్ధరాత్రి మద్యం సేవిస్తున్న నలుగురు యువకులను సిఐ విచారిస్తుండగా… పోలీసుల కళ్లుగప్పి సీఐ వాహనంతో ఓ యువకుడు కోదాడ వైపు పారిపోయాడు. ఆ తర్వాత సీఐ వచ్చి చూసేసరికి వాహనం లేకపోవడంతో షాకయ్యారు.

దీంతో అప్రమత్తమైన పోలీసులు.. దుండగుడిని పట్టుకునేందుకు మరో వాహనంతో వెంబడించారు. ఇదే క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని పోలీసు వాహనం ఢీకొనడంతో.. ఓ కారు ధ్వంసమైంది.

చివరికి చేజింగ్ చేసి ఆలగడప టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని పట్టుకున్నారు పోలీసులు. అక్కడే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.

Tags :
|

Advertisement