Advertisement

  • దుబ్బాక బిజెపి అభ్యర్థి మరియు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు ..

దుబ్బాక బిజెపి అభ్యర్థి మరియు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు ..

By: Sankar Mon, 26 Oct 2020 5:18 PM

దుబ్బాక బిజెపి అభ్యర్థి మరియు బంధువుల ఇళ్లలో పోలీసుల సోదాలు ..


ఉపఎన్నికలు దుబ్బాకలో వేడి పుట్టిస్తున్నాయి... అధికార టీఆర్ఎస్‌ పార్టీ నేతలు కనీసం మమ్మల్ని ప్రచారం కూడా చేయనీయకుండా అడ్డుపడుతున్నారని.. ఎక్కడికక్కడ సోదాలు చేస్తూ.. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు..

ఇక ఈరోజు .. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు ఇళ్లలో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఉదయం నుంచి రఘునందన్‌‌రావు ఇళ్లు, కార్యాలయాలతో పాటు సమీప బంధువల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు.. ఆయన అత్తగారిళ్లు, బంధువుల ఇళ్లలోనూ ఏకకాలంలో ఎనిమిది చోట్ల తనిఖీలు చేపట్టారు.

మరోవైపు.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు... పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.. పోలీసులు తనిఖీల పేరుతో బంధువులు, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించిన బీజేపీ అభ్యర్థి... ఓడిపోతామనే భయంతో టీఆర్ఎస్ నీచ రాజకీయాలు చేస్తుందని దుయ్యబట్టారు. అసలు ఏ ఆధారాలతో తనిఖీ చేస్తున్నారని పోలీసులను నిలదీశారు రఘునందన్‌రావు.

Tags :

Advertisement