Advertisement

  • నటి చిత్ర మరణం ఆత్మహత్యే అని అంటున్న పోలీసులు...

నటి చిత్ర మరణం ఆత్మహత్యే అని అంటున్న పోలీసులు...

By: chandrasekar Fri, 11 Dec 2020 10:17 PM

నటి చిత్ర మరణం ఆత్మహత్యే అని అంటున్న పోలీసులు...


గురువారం ఉదయం జరిగిన పోస్టుమార్టం రిపోర్ట్ ప్రకారం చిన్న తెర నటి చిత్ర ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోందన్నారు. హోటల్‌లో బుధవారం ఉరివేసుకున్న చిత్ర మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టు మార్టం కోసం కీల్పాక్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గురువారం ఉదయం పోస్టుమార్టం జరిగిన తర్వాత మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు.

టీవీ సీరియల్స్‌లో చిత్రతో పాటు నటించిన నటీనటులు చిత్ర చాలా ధైర్యస్థురాలని, ఆత్మహత్య చేసుకోవడానికి బలమైన కారణ౦ వుండవచ్చని చెప్పారు. మరికొంతమంది జనవరిలో జరుగనున్న పెళ్ళి ఏర్పాట్లకుగాను డబ్బులు సమకూర్చడంలో చిత్ర ఇబ్బందులు పడుతూ వచ్చిందని, ఆ కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకునివుండవచ్చని చెబుతున్నారు. చిత్ర ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని ఆమె తల్లి ఆరోపించారు. తన కుమార్తె రిజిస్టర్‌ మేరేజ్‌ చేసుకుని హేమనాథ్‌తో రహస్యంగా కాపురం చేసిందన్నారు. అత్తింటివారు వేధించడం వల్లనో, హేమనాథ్‌ పెట్టిన మానసిక వేధింపుల కారణంగానో చిత్ర ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని పోలీసులకు తాను ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. నజరతే పోలీసులు కూడా చిత్ర ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలను తెలుసుకునే దిశగా ఆమె భర్త హేమనాథ్‌ వద్ద, బుల్లి తెర కళాకారులు సన్నిహితుల దగ్గర విచారణ చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement