Advertisement

  • గ్యాంబ్లింగ్ డెన్‌పై పోలీసులు రైడ్‌.. 42 మంది అరెస్టు

గ్యాంబ్లింగ్ డెన్‌పై పోలీసులు రైడ్‌.. 42 మంది అరెస్టు

By: chandrasekar Mon, 14 Sept 2020 12:27 PM

గ్యాంబ్లింగ్ డెన్‌పై పోలీసులు రైడ్‌.. 42 మంది అరెస్టు


గోవాలోని ప‌నాజీ స‌మీపంలోని క‌లాంగూట్ బీచ్ గ్రామంలోని గ్యాంబ్లింగ్ డెన్‌పై పోలీసులు గ‌డిచిన అర్థ‌రాత్రి రైడ్ చేశారు. ఈ సంద‌ర్భంగా జూదం ఆడుతున్న 42 మంది ప‌ర్యాట‌కుల‌ను అరెస్టు చేయ‌డంతో పాటు సంఘ‌ట‌నా స్థ‌లం నుంచి రూ. 10 ల‌క్ష‌ల న‌గ‌దు, 57 మొబైల్ ఫోన్స్‌, ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్‌, న్యూఢిల్లీ చెందిన ప‌ర్యాట‌కులంతా హోట‌ల్ ఐదో అంత‌స్థులో పేకాట ఆడుతున్నారు. నిందితులంద‌రిపై గోవా, డామ‌న్ అండ్ డ‌య్యూ ప‌బ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ కింద కేసులు న‌మోదు చేసిన‌ట్లు పోలీసు అధికారులు తెలిపారు. అదేవిధంగా హోట‌ల్ లైసెన్స్ ర‌ద్దు చేయాల్సిందిగా కోరుతూ రాష్ట్ర ప‌ర్యాట‌క‌శాఖ‌కు లేఖ రాసిన‌ట్లు పేర్కొన్నారు.

Tags :
|
|
|

Advertisement