Advertisement

  • అనుమతి లేకుండా పార్టీలు , ఫంక్షన్లు నిర్వహిస్తే క్రిమినల్ కేసులే ...

అనుమతి లేకుండా పార్టీలు , ఫంక్షన్లు నిర్వహిస్తే క్రిమినల్ కేసులే ...

By: Sankar Wed, 08 July 2020 07:17 AM

అనుమతి లేకుండా పార్టీలు , ఫంక్షన్లు నిర్వహిస్తే క్రిమినల్ కేసులే ...



తెలంగాణాలో ఒక వైపు కరోనా తీవ్ర రూపం దాల్చి రోజుకి తక్కువలో తక్కువ 1500 కి పైగా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి ..అయినా కూడా జనాల్లో ఏ మాత్రం భయం లేదు..నిన్న మొన్నటి దాకా కేవలం హైదరాబాద్ వరకే పరిమితం అనుకున్న కరోనా ఇప్పుడు హైదరాబాద్ దాటి జిల్లాలకు , పల్లెలకు కూడా వ్యాపించింది ..ఇలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి కానీ ప్రజలు మాత్రం లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత ఇష్టానుసారంగా రోడ్ల మీద తిరుగుతున్నారు ..

ఫంక్షన్ లు అని , పుట్టిన రోజులు అని ఇలా దేనికి తగ్గడం లేదు ..ప్రభుత్వాలు ఎన్నివిధాలుగా అవగాహన కల్పిస్తున్నా కొందరు నిబంధనలను పెడచెవిన పెడుతున్నారు.హైదరాబాద్‌లో ఓహోటల్లో రేవ్‌పార్టీ, మరో వ్యాపారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంపై పోలీసులు కన్నెర్ర జేశారు. ఇకపై రాష్ట్రంలో అనుమతి లేకుండా పార్టీలు, విందులు నిర్వహిస్తే నిర్వాహకులపై క్రిమినల్‌ కేసులు పెడతామని పోలీస్‌ అధికారులు హెచ్చరిస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పటికే 26 వేలకు చేరువైన నేపథ్యంలో పార్టీలు, విందుల అనుమతులను కఠినతరం చేయనున్నారు. ముందస్తు అనుమతి లేకుండా చేపట్టే ఇలాంటి వేడుకలను ఉపేక్షించబోమని పోలీసులు స్పష్టంచేస్తున్నారు. ఇప్పటికే పోలీస్‌స్టేషన్లలోకి వచ్చే ఫిర్యాదుదారులు మాస్కులేకుండా వచ్చినా గుంపులుగా ప్రవేశించినా ఎపిడమిక్‌ యాక్ట్‌ 51(బి) ప్రకారం కేసుల నమోదు, రూ.వెయ్యి జరిమానా విధిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :
|

Advertisement