Advertisement

  • అక్రమంగా లక్కీ డ్రా నిర్వాహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

అక్రమంగా లక్కీ డ్రా నిర్వాహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...

By: chandrasekar Sat, 21 Nov 2020 1:05 PM

అక్రమంగా లక్కీ డ్రా నిర్వాహిస్తున్న వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు...


నిజామాబాద్‌లో కొందరు లక్కీ డ్రా పేరిట అక్రమంగా డబ్బులు దోచేస్తున్నారు. బహుమతుల ఆశ చూపుతూ సామాన్య ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును తమ జేబుల్లో వేసుకుంటున్నారు. కార్లు, బైక్‌లు, టీవీలు గెలుచుకొవచ్చు అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ఓ లక్కీ డ్రా సెంటర్ నిర్వహిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు.. కొందరు వ్యక్తులు జిల్లాలోని ఆర్మూర్ పట్టణంలో లక్కీ డ్రా పేరిట ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇందులో సుమారు 5వేల మంది సభ్యులు ఉన్నారు. ఒక్కో సభ్యుడి నుంచి నెలకు 1200 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. ప్రతి నెల లక్కీ డ్రా పేరిట 10 డ్రాలు తీస్తున్నారు. మొదటి బహుమతి ఆల్టో కారు కాగా, మిగతా తొమ్మిది బైక్‌లు అందజేస్తారు. 15 నెలల కాలపరిమితితో లక్కీ డ్రా నడుపతున్నారు.


డ్రాలో రాని వారికి ఫ్రిడ్జ్ ‌లు, 32 ఇంచుల టీవీలు అందజేస్తామని చెబుతున్నారు. ఇలా 15 నెలల కాలంలో దాదాపు 10 కోట్ల రూపాయల వరకు దండుకుంటున్నారు. అయితే ఇంత పెద్ద మొత్తంలో లక్కీ డ్రా పేరిట డబ్బుల దోపిడి జరుగుతున్న పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూసిన దాఖలు లేవు. అయితే ఈ లక్కీ డ్రా విషయాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సీపీ దృష్టికి తీసుకెళ్లారు. ఇటువంటి లక్కీడ్రాల పేరిట ప్రజలను మోసం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.


అయితే దీనిపై స్పందించిన సీపీ స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీచేశారు. దీంతో ప్లాజా పంక్షన్ హాల్ లక్కీ డ్రా నిర్వహిస్తున్న వారిపై దాడి చేశారు. అయితే పోలీసులు వస్తున్నారనే సమచారం ముందుగానే తెలుసుకున్న నిర్వాహకుల్లో కొందరు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Tags :
|
|

Advertisement