Advertisement

  • మైనర్ కు స్కూటీ ఇచ్చినందుకు మూల్యం 26 వేలు ఫైన్

మైనర్ కు స్కూటీ ఇచ్చినందుకు మూల్యం 26 వేలు ఫైన్

By: Sankar Wed, 09 Dec 2020 9:19 PM

మైనర్ కు స్కూటీ ఇచ్చినందుకు మూల్యం 26 వేలు ఫైన్


వాహనదారులకు పోలీసులు ఎన్ని రకాలుగా హెచ్చరించిన కూడా వారిలో ఏ మాత్రం మార్పు రావడం లేదు ..మైనర్లకు నడపడానికి వాహనాలు ఇవ్వొద్దు అని చెపుతున్నప్పటికీ కూడా అలాగే మైనర్లకు వాహనాలుఇస్తూ యాక్సిడెంట్ లు కావడానికి పరోక్షముగా సహకరిస్తున్నారు ..అందుకే మైనర్‌ను‌ స్కూటీ నడిపేందుకు అనుమతినిచ్చిన ఓ వ్యక్తికి పోలీసులు షాకిచ్చారు. మోటారు వాహన చట్టం- 2019​ ఉల్లంఘించిన కారణంగా అతడికి బుధవారం రూ.26 వేలు ఫైన్‌ వేశారు.

వివరాలు... భువనేశ్వర్‌లోని కందగిరి ప్రాంతంలో మైనర్‌ ఇంకో వ్యక్తి స్కూటీ నడపడంతో జరిమానా విధించారు. ఈ స్కూటీ నిరంజన్‌ డాష్‌ అనే వ్యక్తికి చెందినదిగా అధికారులు తెలిపారు.

యజమాని స్కూటీని పిల్లవాడికి ఇచ్చి చట్టాన్ని ఉల్లఘించడంతో రూ.25 వేల రూపాయలు జరిమానా విధించగా , బాలుడు హెల్మెట్‌ ధరించకపోవడంతో మరో రూ.1000 జరిమానా విధించారు. అంతే కాకుండా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకపోవడంతో సెక్షన్‌ 207 కింద కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్‌ చేశారు.

Tags :
|
|
|
|

Advertisement