Advertisement

  • డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు... ట్రాఫిక్ పోలీసుల జీపు చోరీకి గురి...!

డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు... ట్రాఫిక్ పోలీసుల జీపు చోరీకి గురి...!

By: Anji Sun, 13 Dec 2020 8:33 PM

డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు... ట్రాఫిక్ పోలీసుల జీపు చోరీకి గురి...!

విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసుల జీపు చోరీకి గురైన ఘటన తెలంగాణ వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో జరిగింది.

కాజీపేట ప్రధాన కూడలి వద్ద వాహనాన్ని నిలిపి ఉంచి ట్రాఫిక్ ఎస్సై వాహనదారులకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

ఈ క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి పోలీస్ జీపుని తీసుకుని పరారయ్యాడు. విస్తుపోయిన పోలీసులు సుమారు రెండు గంటలకు పైగా జీపు కోసం వెతికారు. ఎసై మొబైల్ ఫోన్ జీపులోనే ఉండడంతో సిగ్నల్స్ ఆధారంగా గుర్తించారు.

కాజీపేట్ నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో హసన్పర్తి మండలం కొమిటిపల్లి తండా సమీపంలో జీపును పట్టుకున్నారు.

ప్రధాన రహదారి పక్కన నిలిపి ఉంచిన పోలీసు జీపుకే రక్షణ లేనప్పుడు... ఇక మామూలు పౌరుల వాహనాల పరిస్థితి ఏంటనే ఆందోళనలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.

Tags :

Advertisement